సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా కొన్ని కొన్ని సార్లు తమకు నచ్చని పాత్రలను పోషిస్తూ ఉండాలి. అంతేకాదు తమకు కోపం తెప్పించిన సరే కోపాన్ని కంట్రోల్ చేసుకుని కొన్ని సినిమాల్లో నటించాల్సి ఉంటుంది . అలాంటి లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ జెనీలియా . జెనీలియా గురించి అందరికీ తెలిసిందే .. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉన్న మనిషి . అందుకే తెలుగు హీరోలు ఆమెను దూరం పెట్టేశారు. మరి ముఖ్యంగా జెనీలియా అనగానే అందరికీ హాసిని గుర్తొస్తుంది.
బొమ్మరిల్లు సినిమాల్లో నటించి క్రేజీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న జెనీలియా .. ఈ సినిమా తరువాత తన తలరాతను ఎలా మార్చేసుకుందో మనకు తెలిసిందే . అయితే ఈ సినిమాలో ఓ సీన్ చేయడానికి డైరెక్టర్ నానా తండాలు పడ్డారట . జెనీలియా కరెక్ట్ గా డైలాగ్ చెప్పకపోవడం దానికి తోడు క్లైమేట్ సహకరించకపోవడంతో డైరెక్టర్ ఈ సీన్ ని ఏకంగా మూడు రోజులు షూట్ చేశారట.
అర్ధరాత్రి సిద్ధార్థతో ఐస్క్రీమ్ తినడానికి వెళ్తుంది జెనీలియా. ఈ సీన్లో సరిగ్గా నటించని కారణంగా డైరెక్టర్ ఏకంగా మూడు రోజులు ఆమెను రాత్రులు నిద్రపోనికుండా ఇదే షూట్ ని కంటిన్యూ చేశారట . దీంతో కోపం పీక్స్ కి వెళ్ళిపోవడంతో జెనీలియా డైరెక్టర్ పై అరిచి నువ్వు వద్దు నీ సినిమా వద్దు అంటూ వెళ్ళిపోయిందట. రెండు రోజులు షూటింగ్ కి కూడా రాలేదట . ఆ తర్వాత మ్యాటర్ లోకి ఇన్వాల్వ్ అయిన అల్లు అర్జున్ ఆమె కోపాన్ని కూల్ చేసి సినిమాలో నటించమంటూ చెప్పుకొచ్చారట . బన్నీ అంటే ఎంతో ఫ్రెండ్షిప్ ఉన్న జెనీలియా బన్నీ కోసమే ఈ సినిమాలో నటించింది . ఆ తర్వాత ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయి ఆమె కెరీర్ ని ఎలా టర్న్ చేసిందో మనకు తెలిసిందే..!!