Newsశ‌భాష్ చిరు... స్నేహాంకోసం ఎంత విలువ ఇస్తాడో... చిన్న‌నాటి ఫ్రెండ్ కోసం...

శ‌భాష్ చిరు… స్నేహాంకోసం ఎంత విలువ ఇస్తాడో… చిన్న‌నాటి ఫ్రెండ్ కోసం ఏం చేశాడంటే..!

మెగాస్టార్ చిరంజీవి స్నేహానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో చెప్పక్కర్లేదు. ఆయన స్నేహానికి విలువ ఇస్తూ చేసిన సినిమా స్నేహంకోసం చిరంజీవి ద్విపాత్రభినయం చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. చిరంజీవి చాలాసార్లు ఎంతోమందికి ఎన్నోసార్లు చేస్తూ ఉంటారు. తన ఆపన్న హస్తాన్ని అందిస్తుంటారు. అయితే వీటిలో చాలా వరకు బయటకు రావు. తాజాగా ఆయన తన చిన్ననాటి స్నేహితుడుకి ఎంతో సాయం చేశారు.. ఈ విషయం బయటికి రాలేదు.. అయితే ఓ వ్యక్తి సోషల్ మీడియాలో దీనిని పోస్ట్ చేయడంతో ఇది బయటకు వచ్చింది.

ప్రస్తుతం చిరంజీవి తన 157 వ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో కనిపించారు. చిరంజీవి ఎవరి కోసం ? అక్కడికి వెళ్లారా అన్న ఆసక్తి సహజంగానే ఉంటుంది. చిరంజీవి చిన్నప్పుడు మొగల్తూరులో పెరిగారు. అక్కడ ఉన్నప్పుడు చాలామంది స్నేహితులు ఉండేవారు. అందులో పువ్వాడ రాజా ఒకరు. తాజాగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి మర్చిపోలేని సాయం చేశారు.

తన స్నేహితుడు అనారోగ్య సమస్య తెలుసుకొని హైదరాబాద్ అపోలో చికిత్స ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే చిరు స్వయంగా ఆస్పత్రికి వెళ్లి తన చిన్ననాటి స్నేహితుడు రాజాని కలిశారు. ధైర్యం చెప్పారు. డాక్టర్ తో మాట్లాడి స్నేహితుడు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక‌ చిరు సినిమాల గురించి మాట్లాడుకుంటే ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీర‌య్య‌ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఆగస్టు భోళాశంకర్ తో ఘోరమైన డిజాస్టర్ చూశారు. ప్రస్తుతం బింబిసారా దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉంటారు. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news