Newsభగవంత్ కేసరిలో కేవలం ఐదు నిమిషాలకే భారీ రెమ్యూనరేషన్ పొందిన రతిక.....

భగవంత్ కేసరిలో కేవలం ఐదు నిమిషాలకే భారీ రెమ్యూనరేషన్ పొందిన రతిక.. ఎంతంటే…

బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి నాలుగు వారాల్లో తెలివిగా, వ్యూహాత్మకమైన గేమ్‌ప్లేతో లక్షలాది మంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కంటెస్టెంట్ రతికా రోజ్. అయితే, తర్వాతి వారాల్లో ముద్దుగుమ్మ పెద్దగా యాక్టివ్ గా ఉండలేకపోయింది. ఫేక్ ఆట కూడా ఆడటం మొదలు పెట్టింది. అలాగే చాలా బ్యాడ్ గా బిహేవ్ చేసే ప్రేక్షకుల్లో చెడ్డ పేరు తెచ్చుకుంది. దాంతో ఈ ముద్దుగుమ్మ నాలుగో వారంలో ఎలిమినేట్ అయింది. ఆమె గేమ్‌ను బాగా ఆడకుండా ఇతర పోటీదారులతో ఫేక్ రిలేషన్స్ పెట్టుకుంటూ చాలా చిరాకు పుట్టించింది. ఇంతకుముందు ఆమెను పొగిడిన హోస్ట్ నాగార్జున కూడా ఆమె పర్ఫామెన్స్ తో చాలా డిసప్పాయింట్ అయ్యాడు.

అయితే రతికా రోజ్ ఇంకా బిగ్ బాస్ గేమ్ నుంచి పూర్తిగా ఎలిమినేట్ అవ్వలేదు. త్వరలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ వారాంతంలో ఆమె షోలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఆమె తనను తాను నిరూపించుకోవడానికి, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడానికి మరొక అవకాశం ఉంటుంది.

ఇదిలా ఉంటే, రతికా రోజ్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టింది. రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన బాలయ్య బాబు లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’లో ఆమె మంత్రిగా చిన్న పాత్ర పోషించింది. ఆమె స్క్రీన్ టైమ్ ఐదు నిమిషాలే అయినప్పటికీ, ప్రేక్షకుల నుంచి ఆమె నటనకు మంచి స్పందన వచ్చింది. ఆమె తెరపై కనిపించినప్పుడు వారు చప్పట్లు కొట్టి ఉత్సాహపరిచారు. ఈ అతిధి పాత్ర కోసం ఆమెకు 5 లక్షల రూపాయలు కూడా చెల్లించారట. ఇంత తక్కువ స్క్రీన్ టైమ్‌ కనిపించినందుకు అంత మొత్తం ఇవ్వడం చాలా ఎక్కువేనని చెప్పుకోవచ్చు.

సినిమాల్లో పెద్ద పెద్ద పాత్రలు వస్తే రతికా రోజ్ ఎంత వసూలు చేస్తుందోనని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఆమె చాలా అందంగా కూడా ఉంది. టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లతో పోటీ పడగలదు. తన ప్రతిభను, వ్యక్తిత్వాన్ని చాటుకునేందుకు బిగ్ బాస్ మంచి వేదికగా మారిందని తెలుస్తోంది. ఆమె రీ-ఎంట్రీ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7లోని టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఆమె చోటు దక్కించుకోగలదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆమె విన్నర్ అయితే అది బిగ్ బాస్ చరిత్రలోనే ఒక సంచలనం అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news