Newsమైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌: దేవ‌ర‌లో జాన్వీయే కాదు మ‌హేష్ హీరోయిన్ కూడా...!

మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్‌: దేవ‌ర‌లో జాన్వీయే కాదు మ‌హేష్ హీరోయిన్ కూడా…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో పాటు జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల – ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దేవరపై అంచనాలు అదిరిపోతున్నాయి. ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి వార్త కూడా చాలా సెన్సేషనల్ గా ఉంది.

పైగా పాన్ ఇండియా సినిమా కావడంతో పాటు ki. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెర‌కెక్కుతూ ఉండడంతో ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. సౌత్ సినిమా రంగంలో జాన్వీకి ఇదే తొలి సినిమా. ఇక పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాలో కొరటాల ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కృతిస‌న‌న్‌ని ఒప్పించినట్టు తెలుస్తోంది. ఆమె తెలుగులో మహేష్ బాబు వన్ – నేనొక్క‌డినే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ప్రభాస్ హీరోగా వచ్చిన ఆది పురుష్‌ సినిమాలో సీతగాను నటించింది. ప్రతి స్పెషల్ సాంగ్‌లో నటిస్తే సినిమాతో పాటు పాన్ ఇండియా మార్కెట్‌కు చాలా హెల్ప్ అవుతుందన్నదే కొరటాల ప్లాన్.

దీనికి తోడు గతంలో ఎన్టీఆర్ తో కొరటాల తీసిన జనతా గ్యారేజ్ సినిమాలోని కాజల్ అగర్వాల్ స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ ఎంతో పెద్ద హిట్ అయింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ని కొరటాల దేవర సినిమాలోను వాడుతున్నాడు. తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దేవర సినిమాను ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ – మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news