Newsమూడో రోజు బాక్సాఫీస్‌ను మ‌డ‌తెట్టేసిన ' మ్యాడ్‌ ' ... 3...

మూడో రోజు బాక్సాఫీస్‌ను మ‌డ‌తెట్టేసిన ‘ మ్యాడ్‌ ‘ … 3 డేస్ షాకింగ్ వ‌సూళ్లు..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్ని నితిన్ హీరోగా పరిచయం అయిన మ్యాడ్ సినిమా ఈ శుక్రవారం ధియేటర్లలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తొలి రోజు నుంచి అదిరిపోయే టాక్‌ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. రెండో రోజు కంటే మూడో రోజు మరింత ఎక్కువ వసూళ్లు రాబట్టింది.

ఓవరాల్ గా మూడు రోజుల్లో 8.4 కోట్ల రూపాయల గ్రాస్ వ‌సూళ్లు కొల్లగొట్టింది. సిచువేషనల్ కామెడీతో సాగే ఈ ఫన్ డ్రామాను సితార ఎంటర్టైన్మెంట్స్ – ఫార్చ్యూన్ సినిమాస్ పతాకాలపై నిర్మించారు. భీమ్స్ సంగీతమందించిన ఈ సినిమా లాంగ్ రాన్లో మరిన్ని వసూలు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే మ్యాడ్‌ సినిమా అన్ని ఏరియాలోను లాభాల్లోకి వచ్చేసింది.

ఈ ఏడాది వచ్చిన బేబీ సినిమా యూత్ ను ఎలా ? మెప్పించి అదిరిపోయే వసూళ్లు కొల్లగొట్టిందో.. ఇప్పుడు మ్యాడ్‌ కూడా అదే స్థాయిలో వసూళ్లు కొల్లగొడుతుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఏదేమైనా నార్నే నితిన్ కు అదిరిపోయే ప్రారంభం దక్కిందని చెప్పాలి.

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత, శోభన్, రామ్ నితిన్, గౌరీ ప్రియ, ఆనంతిక, గోపిక, ఉదయ్‌, రఘు బాబు, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, విష్ణు అంటోనీ, శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news