Moviesఆ రీజన్ తోనే హరితేజ బంపర్ ఆఫర్ మిస్ చేసుకుందా..? దరిద్రం...

ఆ రీజన్ తోనే హరితేజ బంపర్ ఆఫర్ మిస్ చేసుకుందా..? దరిద్రం వదిలిపోయిందిపో..!!

హరితేజ .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . హోస్ట్ గా నటిగా బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ వెండి తెరపై కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించింది . అంతేకాదు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . మామ మశ్చింద్రా అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె మాట్లాడుతూ ఓ మంచి సినిమాను మిస్ చేసుకున్నాను అన్న విషయాన్ని ఓపెన్ గా స్టేజిపై చెప్పుకు వచ్చింది .

ఆమె మాట్లాడుతూ ..”శేఖర్ కమ్ముల గారు నేను మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒకటే గుర్తొస్తుంది .. చెప్పుకోవాలని కూడా ఉంది .. మంచి అనుభవం.. నేను మీ ఫిలిమ్స్ కి పెద్ద పెద్ద ఫ్యాన్ మీ సినిమాలను కచ్చితంగా చూస్తూ ఉంటాను. అలాంటిది మీ సినిమాలో అవకాశం వస్తే ఎలా మిస్ చేసుకుంటాను.. ఫిదా సినిమాలో అక్క క్యారెక్టర్ కోసం నన్ను ఆడిషన్ కి పిలిచినప్పుడు చాలా చాలా ఆనందపడిపోయాను”.

“ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు అడిషన్ ఇచ్చాను .. సెలెక్ట్ అయిపోతాను అని చాలా ఆశపడ్డాను ..కానీ ఎందుకు రిజెక్ట్ అయ్యాను తెలుసా.. తెలంగాణ యాస రాలేక నాకు అప్పట్లో తెలంగాణ యాస రాదు. ఈ సినిమాకి అదే ఇంపార్టెంట్ అందుకే నన్ను ఈ రోల్ నుంచి రిజెక్ట్ చేశారు . అయితే ఇప్పుడు తెలంగాణ యాస నేర్చుకున్నాను సార్. ఇచ్చి పడేస్తున్నాను మరి అంత ప్యూర్ కాక పోయినప్పటికీ చాలా వరకు బెటర్ అంటూ చెప్పుకు వచ్చింది . దీంతో అక్కడే ఉన్న శేఖర్ కమ్ముల ఆమె మాటలను బాగా ఎంజాయ్ చేస్తూ నవ్వుకున్నాడు. అయితే చాలా మంది హరి తేజ ఈ రోల్ మిస్ అయ్యినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దరిద్రం వదిలిపోయింది అంటూ ఫన్నీగా కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news