News' అన్‌స్టాప‌బుల్ 3 ' లో బాల‌య్య సెటైర్లు వాళ్ల‌కేనా... ర‌చ్చ...

‘ అన్‌స్టాప‌బుల్ 3 ‘ లో బాల‌య్య సెటైర్లు వాళ్ల‌కేనా… ర‌చ్చ రంబోలాయే…!

బాలయ్యను యాంకర్ గా మార్చిన షో అన్‌స్టాప‌బుల్ షోతో ఆహా ఓటీటీకి మంచి పేరు క్రేజీ తీసుకువచ్చిన షో ఇది. సీజన్ 1 సూపర్ డూపర్ హిట్ అయింది. సీజన్ 2 లో కూడా బాలయ్య హోస్టింగ్ అదరగొట్టేశాడు. అయితే సరైన సెలబ్రిటీలను తీసుకురాలేదు. దీంతో సీజన్ వన్తో పోలిస్తే సీజన్ 2 కాస్త డౌన్ అయినట్టు అనిపించింది. ఇప్పుడు సీజన్ 3 కు రెడీ అవుతున్నారు. మొత్తానికి మళ్లీ అన్‌స్టాప‌బుల్‌కు ముహూర్తం రెడీ అవుతోంది. అయితే మూడో సీజన్లో కేవలం 3 – 4 ఎపిసోడ్లతోనే సరిపెట్టేయనున్నారు.

బాలయ్య ఇటు సినిమాలతో పాటు అటు ఏపీలో పొలిటికల్ గా బిజీ బిజీగా ఉన్నారు. దీంతో దీనికి లిమిటెడ్ ఎడిషన్ అని పేరు పెట్టారు. ఈ లిమిటెడ్ ఎడిషన్ లో ముందుగా భగవంత్ కేసరి సినిమా టీంతో తొలి ఎపిసోడ్ అని ఉంది. బాలయ్య భగవంత్ కేస‌రి సినిమాపై మామూలుగా అంచనాలు లేవు. ఈ క్రమంలోనే ఈ సినిమా టీంతో తొలి ఎపిసోడ్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు. తొలి ఎపిసోడ్‌లోనే బాలయ్య పొలిటికల్ గా కూడా రచ్చ చేయనున్నట్టు ఆయన డైలాగ్ చెప్పగానే చెప్పేసింది.

మేం తప్పు చేయలేదని మీకు తెలుసు.. మేము తలవంచమని మీకు తెలుసు.. మమ్మల్ని ఆపటానికి ఎవడు ? రాలేడని మీకు తెలుసు.. అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవడో ఆపుతాడో చూద్దాం అంటూ బాలయ్య అదిరిపోయే డైలాగ్ వేశారు. లిమిటెడ్ అన్‌స్టాపబుల్‌లో బాలయ్య ప్రారంభ ఉపన్యాసం ఇలా ఉంది.ఈ డైలాగులను బట్టి చూస్తే ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయాలను.. అక్కడ పరిస్థితులను బట్టి కొందరికి గట్టిగా తగిలేలా బాలయ్య మాటల తూటాలు పేల్చినట్టు తెలుస్తోంది.

అన్‌స్టాప‌బుల్ సీజన్ 2 కే పొలిటికల్ టచ్ వచ్చేసింది ఇక ఇప్పుడు సీజన్ 3లో రాజకీయంగా బాలయ్య రచ్చ రంబోలా చేయటం ఖాయంగా కనిపిస్తోంది. భగవంత్‌ కేసరి సినిమా దసరా కానుకగా ఈనెల 19 థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news