Moviesవిడాకులు తీసుకోబోతున్న మరో స్టార్ జంట.. ఫ్యాన్స్ కి ఊహించని షాక్...

విడాకులు తీసుకోబోతున్న మరో స్టార్ జంట.. ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇది..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలు .. ఎక్కువగా కనిపిస్తున్నారు. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు విడాకులని చాక్లెట్లు కంటే చాలా సిల్లీగా తీసుకుంటూ ఇష్టమైన వాళ్లని దూరం చేసుకుంటున్నారు . తాజాగా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ సెలబ్రిటీగా పేరు సంపాదించుకున్న ఫర్ధీ ఖాన్ ఆయన భార్య నటాషా మధ్వాని .

వీళ్లిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే రీసెంట్గా నటాషా లేకుండానే ఎయిర్ పోర్ట్ లో తన పిల్లలతో దర్శనమిచ్చాడు . దీంతో వీళ్ల విడాకులు అఫీషియల్ గా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది . డిసెంబర్ 2005 లో వివాహం చేసుకున్న ఈ జంట 18 ఏళ్ల వైవాహిక జీవితాన్ని కంప్లీట్ చేసుకున్నారు .

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు అంటూ ప్రచారం జరుగుతుంది .అంతేకాదు ఫర్దిన్ ఖాన్ సైతం ఆమెతో తెగదెంపలు చేసుకోవడానికి రెడీగా ఉన్నారట . భార్య నటాషా తన పిల్లలతో కలిసి లండన్ లో ఉంటుంది . ఆయన మాత్రం తల్లితో కలిసి ముంబైలో ఉంటున్నారు . రీసెంట్గా ముంబై ఎయిర్పోర్ట్లో పిల్లలతో కనిపించగా నటాషా వీరితో లేకపోవడంతో విడాకుల రూమర్లకు మరింత ఆజ్యం పోసినట్లయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news