Moviesఏఎన్ఆర్ విగ్రహ ఆవిష్కరణ కు చిరంజీవి రాకపోవడానికి కారణం అదేనా..? ఫ్యాన్స్...

ఏఎన్ఆర్ విగ్రహ ఆవిష్కరణ కు చిరంజీవి రాకపోవడానికి కారణం అదేనా..? ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న న్యూస్..!!

రీసెంట్గా అక్కినేని నాగేశ్వరరావు గారి శత సతజయంతి ఉత్సవాలలో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్ఆర్ విగ్రహ ఆవిష్కరణ ఉత్సవం చాలా ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ ప్రముఖులు అందరితోపాటు రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేసి అక్కినేని నాగేశ్వరరావు పట్ల తమకున్న అభిమానాన్ని ప్రూవ్ చేసుకున్నారు .

అంతే కాదు టాలీవుడ్ స్టార్ హీరో దగ్గర నుంచి నిన్న కాకమొన్న ఇండస్ట్రీ లోకి వచ్చిన హీరో వరకు అందరూ ఈ వేడుకకు రావడం గమనార్హం. కాగా ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఈవెంట్ కి ఎందుకు రాలేదు అన్న వార్త ఎక్కువగా వైరల్ అవుతుంది. కావాలనే రాలేదా..? చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే పట్టించుకోని చిరంజీవి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఏఎన్నార్ విగ్రహ ఆవిష్కరణ ఉత్సవానికి వస్తారు..? అని ఫ్యాన్స్ అడుగుతారు అన్న భయంతోనే రాలేదా ..? అంటూ కొందరు ఆకతాయిలు కామెంట్స్ చేస్తున్నారు .

అయితే నిజానికి చిరంజీవికి హెల్త్ బాగోలేదు.. మోకాలు సర్జరీ చేయించుకున్నారు.. ఆ కారణంగానే మోకాళ్ళపై ఎక్కువ స్ట్రెస్ పెట్టొద్దు అన్నారట డాక్టర్స్.. అంతే ఆ రీజన్ తోనే రీసెంట్గా బ్రహ్మానందం కొడుకు పెళ్లికి కూడా అటెండ్ అవ్వలేదు అంటూ తెలుస్తుంది. దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news