MoviesTL రివ్యూ: ఖుషి… ఖుషీగా ఎంజాయ్‌

TL రివ్యూ: ఖుషి… ఖుషీగా ఎంజాయ్‌

టైటిల్‌: ఖుషి
నటీనటులు: విజయ్ దేవరకొండ, సమంత, మురళీశర్మ, సచిన్ కేడ్కర్, వెన్నెల కిషోర్, రోహిణి, రాహుల్ రామకృష్ణ తదితరులు.
సినిమాటోగ్రఫీ: మురళి.జి
ఎడిటర్: ప్రవీణ్ పూడి
సంగీతం: హిషామ్ అబ్ధుల్ వహాబ్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని-వై.రవిశంకర్
దర్శకుడు : శివ నిర్వాణ
రిలీజ్ డేట్‌ :సెప్టెంబర్ 1 , 2023

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ – సమంత కలయికలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెర‌కెక్కిన సినిమా ఖుషి. ఈరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉందో స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:
విప్లవ్ దేవరకొండ (విజయ్ దేవరకొండ) ఆరాధ్య (సమంత)ను చూసి తొలిచూపులోనే ల‌వ్‌లో ప‌డ‌తాడు. అత‌డిని వ‌దిలించుకునేందుకు ఆరాధ్య ఎన్ని అబ‌ద్ధాలు చెప్పినా చివ‌ర‌కు విప్ల‌వ్‌తో ఆమె కూడా ప్రేమ‌లో ప‌డుతుంది. వీరి ప్రేమ‌కు ఆరాధ్య తండ్రి అయిన‌ ప్రవచన కర్త చదరంగం శ్రీనివాసరావు (మురళీ శర్మ) ఒప్పుకోడు. అటు విప్లవ్ తండ్రి మరియు నాస్తికుడైన సత్యం (సచిన్ ఖేడేకర్) కూడా వీరి పెళ్లి ఒప్పుకోడు. ఈ స‌మ‌యంలో తల్లిదండ్రులను ఎదిరించి విప్లవ్ – ఆరాధ్య పెళ్లి చేసుకున్నాక వీరి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు వ‌చ్చాయి ? చివ‌ర‌కు ఏం జ‌రిగింది ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ :
ఈ సినిమా గుడ్ కాన్సెఫ్ట్‌తో పాటు ఫీల్ గుడ్‌, ల‌వ్‌, ఎమోష‌న‌ల్‌గా సాగే ఫ్యామిలీ స్టోరీ. డీసెంట్‌గా నటన కూడా ఖుషికి హైలెట్‌. ఓ ప్ర‌వ‌చ‌న కర్త‌, ఓ నాస్తికుడు మ‌ధ్య సాగే సంఘ‌ర్ష‌ణ కూడా ఈ ప్రేమ‌క‌థ‌లో హైలెట్‌. ల‌వ్ స్టోరీలో కాన్ ఫ్లిక్స్ పెంచ‌డం బాగుంది. విజయ్ – స‌మంత త‌మ పాత్ర‌ల‌కు జీవం పోశారు. శివ నిర్వాణ రాసిన కథ, పాత్రలు… కొత్తగా పెళ్లి అయిన వారి జీవితాల్లోని పరిస్థితులు ఆకట్టుకుంటాయి. భ‌ర్త‌గా విజ‌య్ చ‌క్క‌ని న‌ట‌న క‌న‌పరిచాడు.

సెకండాఫ్‌లో హోమం సీక్వెన్స్ లో.. ఇక సమంత వెళ్ళిపోయాక వచ్చే సీన్ల‌లో విజయ్ నటన సినిమాకే హైలెట్. విజయ్ – సమంత కెమిస్ట్రీ కూడా బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. హీరోయిన్ స‌మంత త‌న స్క్రీన్ ప్రెజెన్స్‌తో అద‌ర‌గొట్టింది. చదరంగం శ్రీనివాసరావుగా మురళీ శర్మ, నాస్తికుడు సత్యంగా సచిన్ ఖేడేకర్ తమ స‌హ‌జ నటనతో ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.

దర్శకుడు శివ నిర్వాణ కథాంశం బాగున్నా చాలా చోట్ల సింపుల్‌గా, స్లోగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లోని కశ్మీర్ సీక్వెన్స్, సెకెండాఫ్‌లో స్క్రీన్ ప్లే స్లోగా సాగుతుంది. హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా రొటీనే. రొటీన్ సీన్లు ట్రిమ్ చేసి ఉన్నా.. లేక వాటిని కొత్త‌గా రాసుకున్నా సినిమా ఇంకా ప్రెష్‌గా ఉండేది.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే…!
టెక్నిక‌ల్‌గా శివ నిర్వాణ దర్శకుడిగా మంచి కథాంశం రాసుకున్నాడు. టేకింగ్ బాగుంది. హిషామ్ అబ్ధుల్ వహాబ్ పాటలు, నేప‌థ్య సంగీతం సినిమాను ఎలివేట్ చేశాయి. ఎడిటింగ్ చాలా సాగ‌దీత సీన్ల‌ను ట్రిమ్ చేయాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాతలు నవీన్ ఎర్నేని-వై.రవిశంకర్ పాటించిన నిర్మాణ విలువ‌లు సూప‌ర్‌.

ఫైన‌ల్‌గా…
ఖుషి అనే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాలో ద‌ర్శ‌కుడు శివ నాస్తికత్వానికి – భక్తి నుంచి మంచి పాయింట్ తీసుకుని.. భార్యాభర్తల మధ్య మంచి ఎమోషనల్ సీన్ల‌తో క‌థ‌నం నడిపి మంచి ఫ్యామిలీ డ్రామా న‌డిపాడు. సినిమాలో కొన్ని రొటీన్ సీన్లు ఉన్నా కూడా విజయ్ – స‌మంత కెమిస్ట్రీ, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు హైలెట్‌. ఓవరాల్ గా ఈ ఖుషి ప్రేక్షకులను ఖుషీ చేస్తుంది.

ఖుషి రేటింగ్‌: 3 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news