Moviesనాని-కాజల్ కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా ఇదే.. వదిలేసి...

నాని-కాజల్ కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా ఇదే.. వదిలేసి మంచి పనే చేసింది..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు సెట్ అవ్వాలంటే టైం కలిసి రావాలి.. అదృష్టం ఉండాలి .. అన్నీ కలిసి వచ్చిన ఆ సినిమా సక్సెస్ అవుతుందా..? లేదా ..? అని కూడా చెప్పలేం. అయితే అన్ని కుదిరినట్లే కుదిరి మిస్ అయిపోయిన క్రేజీ కాంబోస్ ఎన్నో ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఆ క్రేజీ కాంబో సెట్ అవ్వనే లేదు ..ఇక కుదురుతుంది అనే నమ్మకాలు లేవు . అలాంటి కాంబోలో ఒకటి నేచురల్ స్టార్ నాని అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ .

టాలీవుడ్ చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో ఎంతటి క్రేజీ స్ధానాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . న్యాచురల్ స్టార్ నాని కూడా అంతే టాప్ హీరోగా ఎదిగాడు . వీళ్ళిద్దరి కాంబోలో రావాల్సిన ఓ సినిమా మిస్ అయ్యి అభిమానులను డిసప్పాయింట్ చేసింది . ఆ సినిమా మరేదో కాదు “నిన్ను కోరి “. నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాలో నివేదా థామస్ ప్లేస్ లో ముందుగా కాజల్ ను అనుకున్నారట మేకర్స్ .

ఈ పాత్రకు కాజల్ అయితే బాగా సెట్ అవుతుందని ..ఎక్స్ప్రెషన్స్ పలికిస్తుందని.. ఆశపడ్డారట ..కానీ అప్పటికే వేరే ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్న కాజల్ .. ఈ సినిమాని రిజెక్ట్ చేసింది . అయితే నాని మాత్రం చాలా వరకు కాజల్ నే ఈ పాత్రకు చూస్ చేసుకునే చాలా టైం రిక్వెస్ట్ చేశారట. కానీ చాలా టైం ఎక్కువ అయిపోతూ ఉండడంతో డైరెక్టర్ శివ నిర్వాణ ఆ ప్లేస్ లోకి నివేదా థామస్ తీసుకొచ్చారు. నిజానికి కాజల్ కంటే నివేద థామస్ ఈ పాత్రకు బాగా సూట్ అయిందన్న కామెంట్స్ కూడా అప్పట్లో వినిపించాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news