Newsమెగాస్టార్‌కు జోడీగా ముగ్గురు ముద్దుగుమ్మ‌లు... ఆ పేర్లు తెలిస్తే ఫ్యాన్స్ ర‌చ్చకు...

మెగాస్టార్‌కు జోడీగా ముగ్గురు ముద్దుగుమ్మ‌లు… ఆ పేర్లు తెలిస్తే ఫ్యాన్స్ ర‌చ్చకు నో స్టాప్‌…!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా 45 సంవత్సరాల సినిమా కెరియర్ పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ అవ్వగా.. తాజాగా వచ్చిన భోళా శంకర్ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక డిజాస్టర్ అయింది. ప్రస్తుతం చిరంజీవి రెండు సినిమాలు పట్టాలు ఎక్కిస్తున్నారు.

తన పెద్ద కుమార్తె కొణిదల సుస్మిత నిర్మాతగా తెరకెక్కి సినిమాకు కురసాల కళ్యాణకృష్ణ దర్శకుడు. ఇక బింబిసారా పేం వశిష్ట చెప్పిన కథకు కూడా చిరు పచ్చ జెండా ఊపారు. జగదేకవీరుడు అతిలోకసుందరి – అంజి లాంటి సోషియో ఫాంటసీ సినిమాల తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా ఇదే కావటం విశేషం. ఇది పూర్తిగా భిన్నమైన కథ అని తెలుస్తోంది. కథ‌రీత్యా ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారు.

ఇప్పటికే అనుష్క – మృణాల్‌ ఠాకూర్ ఎంపికైనట్టు తెలుస్తోంది. ఇక కీలకమైన మరో కథానాయక పాత్రకు బాలీవుడ్ ముద్దుగా మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్‌ని సంప్రదించినట్టు తెలుస్తోంది. ఆమె కూడా ఓ స్పెషల్ సాంగ్ తో పాటు ఈ సినిమాలో కొన్ని సీన్లలో నటించేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం.

నిజంగా చిరంజీవికి జోడిగా ఈ ముగ్గురు హీరోయిన్లు నటిస్తే మెగా అభిమానులకే కాదు తెలుగు సిన సినీ అభిమానులకు ఇది నిజమైన పండగే. మెగాస్టార్ సినిమా అంటే అభిమానులు అంచనాలు కామన్. ఇప్పుడు చిరుతో పాటు ఐశ్వర్యరాయ్, అనుష్క, మృణాల్‌ ఠాకూర్ అంటే ఇక మెగా అభిమానుల రచ్చకు నాన్ స్టాప్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news