Movies"నీ బ్రతుకు అంతే"..సుధను స్టేజీ పైనే దారుణంగా అవమానించిన పెద్దాయన..!!

“నీ బ్రతుకు అంతే”..సుధను స్టేజీ పైనే దారుణంగా అవమానించిన పెద్దాయన..!!

సీనియర్ నటి సుధ .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . ఎన్నో సినిమాలలో స్టార్ హీరో హీరోయిన్లకు అమ్మగా నటించి పలు ఇంట్రెస్టింగ్ పాత్రల ద్వారా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . క్యారెక్టర్ ఇలాగే ఉండాలి అని ఎప్పుడు సుధా డిమాండ్ చేయదు.. ఫన్నీనెస్ క్రియేట్ చేయడానికి కొన్ని సార్లు హద్దులు కూడా మీరి నటించారు. సుధా పై కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్ చేసిన కామెంట్స్ కి మాత్రం చాలా సీరియస్ అయిపోయింది.. ఎమోషనల్ అయిపోయింది.

స్టేజ్ పైన ఏడ్చేసింది . ఎన్టీఆర్ బాద్షా సినిమాలో ఆమె ఓ రోల్ నటించింది . అయితే ఈ క్రమంలోనే స్టేజిపై సంగీత్ ఈవెంట్ లో అందరితో పాటు సుధా కూడా డాన్స్ చేయాలి . ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేస్తున్న సుందరం మాస్టర్ ఆమెకు కొన్ని స్టెప్స్ చెప్పారు . బాడీ హెవీగా ఉండడంతో అలాంటి స్టెప్స్ చేయలేకపోయింది . అయితే సుందరం మాస్టర్ కోపం పీక్స్ కి వెళ్లి ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా ..? ఈ మాత్రం కూడా డాన్స్ స్టెప్స్ రావా..? లైఫ్ లాంగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే చేసుకుంటూ బతికి పోతావా..? అంటూ ఫుల్ సీరియస్ అయిపోయారట .

దీంతో ఆమె ఆ కామెంట్స్ భరించలేక అక్కడే ఏడ్చేసిందట. అప్పుడు ఎన్టీఆర్ ఆమెను బాగా సముదాయించారట . అంతేకాదు ఆయన కోపంలో అన్నాడు మేడం మీరు పట్టించుకోకండి అంటూ చాలా కూల్ గా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారట. ఆ తర్వాత సుందరం మాస్టర్ ఆమె నటనకు మెచ్చి పలు సినిమాల్లో ఆయన అవకాశం ఇచ్చారు . సుధా తర్వాత ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు . సుధా కూడా ఆ విషయాన్ని అక్కడితోనే మర్చిపోయారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news