Movies"ఆ రెండిటికి భయపడే పిల్ల సూసైడ్ ఎలా చేసుకుంది..?"..విజయ్ ఆంటోనీ...

“ఆ రెండిటికి భయపడే పిల్ల సూసైడ్ ఎలా చేసుకుంది..?”..విజయ్ ఆంటోనీ కూతురు మరణం పై నటి సుధ సంచలన కామెంట్స్..!!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తనదైన స్టైల్ లో నటించి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన నటుడిగా ..డైరెక్టర్గా.. ప్రొడ్యూసర్గా .. మ్యూజిక్ డైరెక్టర్గా ఎన్నో ఎన్నో వేరియేషన్స్ లో జనాలను అలరించారు . కాగ విజయ్ ఆంటోని కూతురు మీరా తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది . మంగళవారం తెల్లవారుజామున ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది .

అయితే దీనికి గల కారణాలు ఇప్పటివరకు బయటకు రాలేదు. స్కూల్ టీచర్స్ ఆమెకి చదువు విషయంలో ఎటువంటి స్ట్రెస్ లేదని చెప్తూ ఉంటే కుటుంబ సభ్యులు మాత్రం స్ట్రెస్ కారణంగానే ఆమె ఇలా సూసైడ్ చేసుకొని ఉండొచ్చు అని చెప్పుకొస్తున్నారు . ఇలాంటి క్రమంలోని సీనియర్ నటి సుధా.. విజయ్ ఆంటోని కూతురు మీరా మరణం పై షాకింగ్ కామెంట్స్ చేశారు .

ఆమె మాట్లాడుతూ..” ప్రజెంట్ నేను విజయ్ తో ఓ సినిమా చూస్తున్నాను . గత పది రోజులుగా ఆ సినిమా షూట్ లోనే ఉన్నాం . ఆదివారం రాత్రి ఆయన ఇంటికి వెళ్లారు. అయితే నాతో ఉన్న పది రోజులు కూడా ఇంటి గురించి పిల్లల గురించి చెప్పేవారు . ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేకపోయాం . విషయం తెలిసిన వెంటనే వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి మాట్లాడాను. అయితే చీకటి అన్న ..ఒంటరిగా ఉండాలన్న భయపడే మీరా .. ఎందుకు ఇలా చేసింది అన్నది ఎవరికి అర్థం కావడం లేదు . ఇది నిజంగా విజయ్ ఆంటోనికి చాలా కష్ట సమయం.. బహుసా దేవుడు కూడా ఆయనను పరీక్షిస్తున్నట్లు ఉన్నాడు. మొన్ననే చావు అంచుల వరకు వెళ్లి బతికి బయటపడ్డాడు .. నీ ఓపిక .. సహనం ఎంత ఉందా..? అని దేవుడు పరీక్షిస్తున్నట్లు ఉన్నారు అంటూ చాలా ఎమోషనల్ గా స్పందించింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news