Movies"నా జీవితం ఇలా మారిపోయింది ఏంటి..?"..ఫస్ట్ టైం ఓపెన్ గా మాట్లాడిన...

“నా జీవితం ఇలా మారిపోయింది ఏంటి..?”..ఫస్ట్ టైం ఓపెన్ గా మాట్లాడిన సమంత..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత .. నిరంతరం అభిమానులతో చాట్ చేస్తూనే ఉంటుంది. మరి ముఖ్యంగా మయోసైటిస్ వ్యాధికి గురైన తర్వాత అభిమానులతో ఇన్స్టా వేదిక ద్వారా ఎక్కువగా మింగిల్ అవుతున్న సమంత .. రీసెంట్గా మరోసారి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చుటించింది . ఈ క్రమంలోనే పలువురు జనాలు అడిగిన ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే తర్వాతి ప్రాజెక్ట్ ఏం చేస్తున్నారు అనగా “ప్రస్తుతానికి ఏమీ లేవు.. త్వరలోనే దీనిపై అఫీషియల్ గా వివరిస్తాను” అని చెప్పుకొచ్చింది .

అంతే కాదు కంఫర్ట్ జోన్ దాటి సినిమాలు చేయాలని అనుకుంటున్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది . మీరు చాలా అందంగా ..మీ చర్మం చాలా కాంతివంతంగా మెరిసిపోతూ ఉంటుంది ..ఎలా..? అని అడగ్గా.. సమంత దానికి ఆన్సర్ ఇస్తూ మీరు అనుకుంటున్నట్లు ఏమీ లేదు. మయోసైటీస్ కి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు నా ఫేస్ చాలా చాలా మారిపోయింది.. పూర్తిగా పిగ్మెంటేషన్ వచ్చేసింది. నన్ను చాలా గ్లాసీగా మారుస్తాను అన్నింది చిన్మయి అంటూ చెప్పుకొచ్చింది .

అంతేదు నేటి జనరేషన్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి అని అడగ్గా..” ఒకటే చెబుతున్నాను నా లైఫ్ ఇలా అయిపోయింది.. నా జీవితం ఇలా మారిపోయింది అని.. ఎప్పుడూ అనుకోవద్దు.. మీ ప్రయాణంలో మీకు ఎన్నో కష్టాలు సమస్యలు ఎదురవుతాయి .. కాదు అనడం లేదు .. వాటిని ధైర్యంగా ఎదుర్కొండి.. అప్పుడే లైఫ్ లో ముందుకు వెళ్ళగలరు .. అసలైన సక్సెస్ ని రుచి చూడగలరు.. 25 ఏళ్ల వయసులో నా జీవితం ఇలా అయిపోతుందని నేను అనుకోలేదు .. ఇప్పుడు నా జీవితం ఇలా ఉంటుంది అని కూడా నేను అనుకోలేదు .. అన్ని పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్ గానే రిజల్ట్ ఉంటుంది “అంటూ చెప్పుకొచ్చింది . అంతేకాదు సిటాడిల్ గురించి చెప్తూ ఈ సిరీస్ లో నేను చాలా హాట్గా నాలోని డిఫరెంట్ యాంగిల్ ని మీరు చూడబోతున్నారు అంటూ చెప్పుకొచ్చింది . దీంతో సమంత కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news