Newsర‌వితేజ‌తో చెప్పులు మొయించిన స్టార్ హీరోయిన్‌...!

ర‌వితేజ‌తో చెప్పులు మొయించిన స్టార్ హీరోయిన్‌…!

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన హీరోలలో మాస్ మహారాజ్ రవితేజ ఒకరు. తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటకు చెందిన రవితేజ కెరీర్ ప్రారంభంలో డైరెక్టర్ అవ్వాలన్న కోరికతో ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా సంవత్సరాల పాటు పని చేశారు. కృష్ణవంశీ – రాంగోపాల్ వర్మ – కే రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రవితేజని కృష్ణవంశీ హీరోని చేశాడు.

ఆ తర్వాత మాస్ మహారాజుదిగా టాలీవుడ్ లో తిరిగిలేని స్టార్ హీరో అయిపోయారు. రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న టైంలో ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఎన్ని అవమానాలు ఎదురైనా వాటిని తట్టుకుని తనకు వచ్చిన ప్రతి అవకాశం ఉపయోగించుకున్నాడు. అందుకే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడన‌టంలో సందేహం లేదు.

ఓ ప్రముఖ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్న రోజుల్లో ఒక టాప్ హీరోయిన్ కి ఒక షాట్‌ కోసం వేసుకోవాల్సిన చెప్పులు లేకపోవడంతో ఆ డైరెక్టర్ చాలా చిరాకు పడ్డాడు అట. ఇవన్నీ చూసుకోవాల్సిందే అసిస్టెంట్ డైరెక్టర్ కదా ఆ రవితేజ ఏం చేస్తున్నాడు ? పిలవండి వాడిని అంటూ సెట్స్ లో అందరి ముందే రవితేజపై అరిచేశాడట.

అప్పుడు రవితేజ మీరు ఇచ్చిన చెప్పులే ఆమెకు ఇచ్చాను సార్.. అవి వేసుకుని షాట్‌కి వస్తుంది అనుకున్నాను.. ఇలా చేస్తుందనుకోలేదు అని చెప్పాడట. అప్పుడు ఆ డైరెక్టర్ ఆ హీరోయిన్ తిట్టే ధైర్యం చేయలేక రవితేజపై ఇష్టం వచ్చినట్టు అరిచాడట. అప్పుడు స్వయంగా రవితేజనే ఆమె వేసుకున్న‌ చెప్పులను తొల‌గించి… ఆ హీరోయిన్ పాదాలను తాకి డైరెక్టర్ ఇచ్చిన చెప్పులను తొడిగాడ‌ట‌.

షాట్‌ అయిపోయాక తన వల్ల అన్ని తిట్లుతున్నందుకు రవితేజకి ఆ టాప్ హీరోయిన్‌ క్షమాపణ చెప్పిందట. అయితే ఆ టాప్ హీరోయిన్ ఎవరు ? అన్న పేరు మాత్రం రవితేజ బయట పెట్టలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news