Newsపూజాహెగ్డే త‌ల పొగ‌రు మొత్తం దించేశారా... టాలీవుడ్‌లో ఇంతక‌న్నా ఘోర అవ‌మానం...

పూజాహెగ్డే త‌ల పొగ‌రు మొత్తం దించేశారా… టాలీవుడ్‌లో ఇంతక‌న్నా ఘోర అవ‌మానం ఉందా…!

ఓడలు బండ్లు అవుతూ ఉంటాయి అన్న సామెత మనం ఎంతోమంది విష‌యంలో చూస్తూ ఉంటాం. నిన్న హీరోలుగా ఉన్నవాళ్లు ఈరోజు జీరోలు అవుతూ ఉంటారు. నిన్న జీరోలు.. ఈరోజు హీరోలు అవుతూ ఉంటారు.
పూజా హెగ్డే ను తిరుగులేని స్టార్ హీరోయిన్ను చేశారు తెలుగు సినీ ప్రేక్షకులు. ఇక్కడ స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు నిర్మాతలు వరుసగా ఆమెకు తమ సినిమాలలో ఛాన్సులు ఇస్తూ ఎంకరేజ్ చేశారు.

తెలుగులో ఆమెకు తిరుగులేని క్రేజ్ వ‌చ్చేసింది. దీంతో పూజా హెగ్డే కి ఒక్కసారిగా పొగరు తలకి ఎక్కేసింది. తాను అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేయడం మొదలు పెట్టింది. ఒకానొక దశలో ఆమె తీరుతో స్టార్ హీరోలు సైతం ఇబ్బందులు పడ్డారు. ప్రభాస్ కూడా పూజ హెగ్డే సరిగా డేట్లు ఇవ్వకపోవడంతో రాధేశ్యామ్‌ సినిమా విషయంలో చాలా ఇబ్బంది పడిన విషయం తెలిసిందే.

అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక్కసారిగా పూజ సీన్ రివర్స్ అయ్యింది. ఆమెకు రష్మిక, శ్రీలీల రూపంలో గట్టి పోటీ ఎదురు కావడంతో ఆమెకు ఛాన్సులు ఇచ్చే విషయంలో ఎవరు ఆసక్తి చూపటం లేదు. తాజాగా ఆమె రెండు గోల్డెన్ ఛాన్సులు మిస్ చేసుకుంది. రవితేజ – గోపీచంద్ మలినేని సినిమాలో పూజా హెగ్డే పేరు హీరోయిన్గా తెరపైకి వచ్చింది. ఆమె కాల్ సీట్లు కూడా ఇస్తానని చెప్పింది.

ఇంతలోనే ఆమె ప్లేస్ లో రష్మికను తీసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాలో కూడా ముందు ఆమెనే హీరోయిన్ అనుకున్నారు. ఆ తర్వాత ఆ ఛాన్స్‌ కూడా శ్రీలీల కొట్టేసింది. ఇప్పుడు రష్మిక, శ్రీ లీల ఇద్దరు కూడా పూజా హెగ్డే ఛాన్సులు వరుస పెట్టి లాగేసుకుంటున్నారు. ఇది ఖ‌చ్చితంగా పూజ‌కు, ఆమె స్టార్ డ‌మ్‌కు పెద్ద అవ‌మానం లాంటిదే అంటున్నారు. దీంతో పూజ టాలీవుడ్ నుంచి ఫేడ‌వుట్ అయ్యేందుకు ఎంతో టైం పట్టదన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news