Moviesఎన్టీఆర్ కి అలాంటి రోల్ లో నటించాలి అని ఉందా..? తాతకు...

ఎన్టీఆర్ కి అలాంటి రోల్ లో నటించాలి అని ఉందా..? తాతకు తగ్గ మనవడే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు . హీరోయిన్లు ఉన్నారు . ఒక్కొక్కరు 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్న స్థాయికి ఎదిగారు . అయితే చాలామంది హీరోలు ఇంకా తమ డ్రీమ్ రోల్ ని ఫుల్ ఫిల్ చేసుకోలేదు . వాళ్ళు ఇష్టపడిన రోల్ లో నటించలేకపోయారు . ఆలిస్ట్ లోకి వస్తాడు టాలీవుడ్ స్టార్ హీరో గా పాపులారిటి దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్.

నందమూరి నటవారుసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన ప్రజెంట్ గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ దక్కించుకొని సినిమా ఇండస్ట్రీని తన నటనతో షేక్ చేస్తున్నాడు. కాగా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే పల సినిమాల్లో వైవిధ్య భరితమైన నటనతో ఎన్నో అవార్డులను దక్కించుకున్నాడు. ఎన్నో రోల్స్ లో నటించి మెప్పించాడు కానీ ఇప్పటివరకు తన డ్రీమ్ రోల్ లో నటించలేకపోయాడు . ఈ విషయాన్ని స్వయానా ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ కి తన తాతగారులా కృష్ణుడి పాత్రలో కనిపించాలి అని .. ఎప్పటినుంచో కోరిక ఉండేదట . ఇప్పటివరకు ఆ కోరిక తీరనే లేదు. ఆశ్చర్యం ఏంటంటే.. తన వద్దకు వచ్చిన డైరెక్టర్స్ కూడా అలాంటి రోల్స్ తీసుకో రాకపోవడం గమనార్హం. అయితే బృందావనం సినిమాలో ఓ పాటలో భాగంగా కొన్ని నిమిషాలు అలా మెరిసి ఇలా మాయమైపోయాడు ఎన్టీఆర్ . అయితే ఫుల్ లెంత్ రోల్ లో కృష్ణుడు గెటప్ లో కనిపించాలి అనేది ఎన్టీఆర్ కోరిక . చూద్దాం మరి ఎన్టీఆర్ కోరికను తీర్చే ఆ డైరెక్టర్ ఎక్కడున్నాడో..? ఆ రోజు ఎప్పుడు వస్తుందో ..? అభిమానుల కల ఎప్పుడు నెరవేరుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news