Newsబిగ్ న్యూస్‌: ఆ క్రేజీ ప్రాజెక్టులో విల‌న్‌గా మ‌హేష్‌బాబు... డైరెక్ట‌ర్ ఎవ‌రంటే...!

బిగ్ న్యూస్‌: ఆ క్రేజీ ప్రాజెక్టులో విల‌న్‌గా మ‌హేష్‌బాబు… డైరెక్ట‌ర్ ఎవ‌రంటే…!

జస్ట్ అర్జున్ రెడ్డి సినిమాతో వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ గా త్రో అవుట్ ఇండియాలో పేరు తెచ్చుకున్నాడు మన తెలుగు డైరెక్టర్ సందీప్ వంగ. ప్రస్తుతం బాలీవుడ్ హీరో ర‌ణ‌వీర్‌తో యానిమల్ సినిమా తెరకెక్కిస్తున్న సందీప్ తన ఫ్యూచర్ ప్రాజెక్టుపై అనుకోకుండా లీక్ ఇచ్చారు. అందరిని సర్ప్రైజ్ చేస్తూ తాను సూపర్ స్టార్ మహేష్ బాబును డైరెక్ట్ చేయబోతున్నట్టు చెప్పారు.

సందీప్ మహేష్ సినిమాపై ఇచ్చిన హింట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చేయడాది ప్రేక్షకులు ముందుకు రానుంది.

ఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. పాను వరల్డ్ రేంజ్ లో రు. 700 కోట్ల భారీ బడ్జెట్తో రాజమౌళి మహేష్ బాబు సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా తర్వాత సందీప్ వంగా డైరెక్షన్లో మహేష్ బాబు నటించిన సినిమా ఉండబోతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక గ్యాంగ్ స్టార్ గా కనిపించనున్నారు. ఇదే విషయాన్ని తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు సందీప్ వంగా.

మహేష్ కోసం నెగిటివ్ షేడ్‌లో ఉండే ఓ కథను రెడీ చేశానని.. అండర్ వరల్డ్ డాన్ గా ఆ సినిమాలో మహేష్ కనిపిస్తారని.. మహేష్ బాబు కూడా ఈ కథను లాక్ చేశారని సందీప్ గా చెప్పారు. సందీప్ వంగా చెప్పిన ఈ మాటలతో మహేష్ అభిమానులు ఫుల్ ఖుషి గా ఉన్నారు. ఖచ్చితంగా రాజమౌళి సినిమా తర్వాత వచ్చే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషనల్ క్రియేట్ చేయటం ఖాయమన్న ధీమాతో ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news