Moviesరెండో సినిమా కూడా బడా స్టార్ తోనే.. 100కోట్ల హీరోని పట్టేసిన...

రెండో సినిమా కూడా బడా స్టార్ తోనే.. 100కోట్ల హీరోని పట్టేసిన జాన్వీ కపూర్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిలోకసుందరిగా పేరు సంపాదించుకున్న శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్.. తెలుగులో డేబ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ – కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ద్వారా తెలుగులోకి జాన్వి కపూర్ ఎంట్రీ ఇస్తుంది . ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . అంతేకాదు జాన్వి కపూర్ ఫస్ట్ లుక్ కూడా అభిమానులను బాగా ఆకట్టుకునింది . అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ పై ఉండగానే జాన్వికపూర్ కు తెలుగులో రెండు బడా ఆఫర్లు వచ్చినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది .

కాగా ఇప్పటివరకు చరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అఖిల్ అక్కినేనితో కూడా మరో ప్రాజెక్ట్ కి కమిట్ అయిందట . కానీ ఈ రెండు ప్రాజెక్ట్ లు సెట్స్ పైకి వెళ్లడానికి కొంచెం టైం పడుతుంది . ఈ లోపు థర్డ్ ప్రాజెక్ట్ ని కూడా ఫైనలైజ్ చేసేసింది జాన్వికపూర్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

విజయ్ దేవరకొండ విజయ్ తిన్నూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా అనుకున్నారు కానీ ఆమెకు ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా నుంచి ఆమె తప్పకున్నింది. అంతేకాదు ఆ ప్లేస్లోకి రష్మిక మందన్నా వచ్చింది . అయితే ఇప్పుడు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా క్రేజీ రోల్ లో జాన్వి కపూర్ సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

బోనీకపూర్ స్పెషల్ గా రిక్వెస్ట్ చేసి మరి ఈ పాత్ర కోసం జాన్వీని రంగంలోకి దించారట విజయ్ తిన్నురి. తెరపై విజయ్ – జాన్వి జంట బాగుంటుంది అన్న కామెంట్స్ కూడా ఎక్కువ వినబడుతున్నాయి . అంతేకాదు విజయ్ దేవరకొండ అంటే జాన్వికి పిచ్చ పిచ్చ ఇష్టం . ఈ విషయం ఆమె చెప్పుకు వచ్చింది . ఇంత ఇష్టమైన హీరో సినిమాను ఎలా రిజెక్ట్ చేస్తాను అంటూ జాన్వి ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ అయినా ఓకే చేసిందట. త్వరలోనే అఫిషియల్ ప్రకటన కూడా రాబోతుంది అంటూ తెలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news