Newsఆ హీరోయిన్‌తో జగపతిబాబు సీక్రెట్‌గా అఫైర్.. ఫ్లాట్ కూడా కొనిచ్చాడా...!

ఆ హీరోయిన్‌తో జగపతిబాబు సీక్రెట్‌గా అఫైర్.. ఫ్లాట్ కూడా కొనిచ్చాడా…!

జగపతిబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా ఏ పాత్రనైనా అవలీలగా చేయగల దిగ్గజ నటుడితడు. గాయం, శుభలగ్నం, మావిచిగురు, పెళ్లి పందిరి, అంతఃపురం, బడ్జెట్ పద్మనాభం వంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఫ్యామిలీ హీరోగానే కాకుండా విలక్షణ నటుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఈ సీనియర్ హీరో సలార్, పుష్ప 2, గుంటూరు కారం వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నాడు.

కెరీర్ పరంగా జగపతిబాబు మంచి పేరు తెచ్చుకున్నా వ్యక్తిగతంగా మాత్రం అతడిపై చాలా చెడ్డ రూమర్స్ వచ్చాయి. ముఖ్యంగా హీరోయిన్లతో అతడు అఫైర్లు నడిపినట్లు ప్రచారం సాగింది. ఈ సీనియర్ హీరో సినిమాల ద్వారా కోట్ల ఆస్తి సంపాదించి అంతా పోగొట్టుకున్నాడని అంటారు. చివరికి సొంత ఇల్లు కూడా అమ్ముకున్నాడని ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తుంటుంది. డబ్బంతా కోల్పోయినప్పుడు కూడా జగపతిబాబు నిండుకుండలా తొణక‌కుండా ఉన్నాడని అంటారు. మళ్లీ సినిమాలు చేస్తూ 30 కోట్లు సంపాదించి జీవితాంతం హ్యాపీగా ఉండాలని అనుకునే వాడట.

అయితే అదృష్టం కొద్దీ అతడికి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. లెజెండ్ సినిమాలో విలన్‌గా అద్భుతంగా నటించి ఈ జగ్గుబాయ్ ఆశ్చర్యపరిచాడు. ఆ సమయం నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా దూసుకెళ్తున్నాడు. డబ్బులు కూడా బాగా సంపాదిస్తున్నాడు. ఇదంతా బానే ఉన్నా అతని అఫైర్ల గురించి రూమర్స్ ఇప్పటికీ ఆగట్లేదు. ఈ ఫ్యామిలీ హీరో సహజ నటి సౌందర్యతో పాటు కొందరు హీరోయిన్లతో రిలేషన్ పెట్టుకున్నట్లు పుకార్లు ఎప్పటినుంచో షికారు చేస్తున్నాయి.

ముఖ్యంగా ఈ సీనియర్ హీరో యమదొంగ హీరోయిన్ ప్రియమణితో గాఢమైన ప్రేమాయణం నడిపించాడని అంటారు. ఈ ముద్దుగుమ్మ జగ్గుబాయ్‌తో కలిసి పెళ్లయిన కొత్తలో సినిమా చేసింది. ఇందులో వీరు ఇంటెన్స్ రొమాంటిక్ సీన్లలో నటించారు. అప్పుడే వారి మధ్య అఫైర్ మొదలైందని అంటారు. ఈ మూవీ తర్వాత ఈ ఇద్దరు కలిసి ప్రవరాఖ్యుడు, సాధ్యం, క్షేత్రం వంటి సినిమాల్లో మళ్లీ జత కట్టారు. ఆ సినిమాలతో వీరిద్దరూ బాగా దగ్గరయ్యారని, కొన్నేళ్లపాటు సీక్రెట్ రిలేషన్ మెయింటెన్ చేశారని సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది.

అయితే ఆమెపై ప్రేమతో ఒకానొక సమయంలో జగపతిబాబు ఫ్లాట్ కూడా కొనిచ్చాడని వార్తలు వచ్చాయి. జగ్గు భాయ్ తనకు ఫ్లాట్ కొనిచ్చినట్లు వస్తున్న రూమర్స్ పై ప్రియమణి ఎప్పుడూ స్పందించలేదు కానీ అతనితో ఉన్న రిలేషన్ నిజం కాదని, తాము మంచి స్నేహితులం మాత్రమేనని తెలిపింది. మరి ఇందులో నిజం ఎంత ఉందో వారిద్దరికే తెలియాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news