జాతీయ అవార్డు విజేత బన్నీతో సినిమా చేసేందుకు స్టార్ డైరెక్టర్లు ఎదురుచూపులు చూస్తున్నారు. బన్నీ డేట్లు దొరికితే చాలు సినిమాలు చేయాలని ఎంతో ఆత్రుతతో ఉన్నారు కొందరు దర్శకులు. బన్నీతో సినిమా కోసం ఇద్దరు తమిళ దర్శకులు లింగస్వామి, అట్లీతోపాటు టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి కూడా లైన్లో ఉన్నారు. బోయపాటి ఎలాంటి సినిమాలు తీసినా కూడా బన్నీకి సరైనోడు లాంటి మాస్ హిట్ ఇచ్చాడు.
ఆ సినిమాతో బన్నీకి మాస్ ఇమేజ్ పెరిగింది. దాంతో బోయపాటి అంటే బన్నీకి ఆ కృతజ్ఞత ఉంది. ఆల్రెడీ గీతా సంస్థకు ఓ సినిమా బాకీ ఉన్నాడు బోయపాటి. అల్లు అరవింద్ ఎప్పుడో బోయపాటికి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు బన్నీ ఓకే అంటే బన్నీ – బోయపాటి కాంబినేషన్లో సినిమా ఫిక్స్ అయినట్టే. అయితే బోయపాటి తాజాగా రామ్‌తో స్కంద సినిమా తెరకెక్కించారు.
ఈ సినిమా ఈ నెలలోనే థియేటర్లలోకి వస్తుంది. కొద్ది రోజుల క్రితం బోయపాటి బన్నీని కలిసినప్పుడు స్కంద సినిమా హిట్ అయితే వెంటనే చేద్దాం అని ఒక మాట అన్నాడట. ఇప్పుడు బోయపాటి – బన్నీ కాంబినేషన్లో సినిమా రావాలి అంటే కచ్చితంగా స్కంద సినిమా సూపర్ హిట్ అవ్వాల్సి ఉంది.
వాస్తవంగా ట్రైలర్ చూస్తే బోయపాటి మార్కు పరమ రొటీన్ మాస్ మసాలా యాక్షన్ సినిమాగా కనిపిస్తుంది. మరి రామ్ – బోయపాటి కలిసి ఏదైనా మ్యాజిక్ చేశారా ? లేదా అన్నది రిలీజ్ రోజున తేలిపోనుంది. కచ్చితంగా హిట్ అయితేనే బన్నీ బోయపాటికి ఛాన్స్ ఇస్తారు.. లేకపోతే బోయపాటి – బన్నీ కాంబినేషన్ ఇప్పట్లో లేనట్టే..!