Moviesరిలీజ్ కి ముందే రికార్డులు బద్ధలు కొడుతున్న దేవర.. నాన్ థియేట్రికల్...

రిలీజ్ కి ముందే రికార్డులు బద్ధలు కొడుతున్న దేవర.. నాన్ థియేట్రికల్ రైట్స్ ఎన్ని కోట్లకు అమ్ముడుపోయాయ్ అంటే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా దేవర . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న .. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ తెలుగులోకి డెబ్యూ ఇవ్వబోతుంది. అంతేకాదు ఈ సినిమా ద్వారానే తన చెల్లి ఖుషికపూర్ కూడా డేబ్యూ ఇవ్వబోతుంది అన్న ప్రచారం ఊపందుకుంది. ఇలా ఉండగా రీసెంట్గా దేవర సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది .

దేవర మూవీ నాన్ థియేట్రికల్ హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ ఏర్పడింది అంటూ తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమా రైట్స్ ఏకంగా ఒకటి కాదు రెండు కాదు 147 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి అంటూ సమాచారం లీక్ అవుతుంది. దీని అంతటికి కారణం అనిరుధ్ మ్యూజిక్ కి అంటూ తెలుస్తుంది. అనిరుధ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేయడం వల్ల ఈ సినిమాకి బాగా కలిసి వచ్చిందని సోషల్ మీడియాలో ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే దాదాపు సగం బడ్జెట్ హక్కుల ద్వారానే రికవరీ చేసేసిందని దేవర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు .

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి ఉండే క్రేజ్ పైగా ఈ మధ్యకాలంలో అనిరుధ్ మ్యూజిక్ చేసిన ప్రతి సినిమా హిట్ అవ్వడం.. కొరటాల శివ కంటెంట్ రైటింగ్ .. తారక్ నటన ఈ సినిమాకు మరింత ప్లేస్ కాబోతున్నాయి అంటూ తెలుస్తుంది. అందుకే ఈ సినిమాని హ్యూజ్ రేంజ్ లో డబులు పెట్టి కొనుక్కుంటున్నారు నిర్వాహకులు . కాగా తారక్ గత సినిమాలో మించి దేవర ఉండబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అండర్ వాటర్ సీక్వెన్స్ ఈ సినిమాకి మరింత హైలెట్గా నిలుస్తాయని ఈ సినిమాతో మరో ఆస్కార్ ఎన్టీఆర్ అందుకోబోతున్నాడు అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news