Newsఆ డ్యాన్స‌ర్‌తో ల‌వ్‌లో అరియానా.. ఎట్ట‌కేల‌కు నిజం ఒప్పుకుందిగా... ( వీడియో)

ఆ డ్యాన్స‌ర్‌తో ల‌వ్‌లో అరియానా.. ఎట్ట‌కేల‌కు నిజం ఒప్పుకుందిగా… ( వీడియో)

బుల్లితెరపై ప్రసారం అవుతున్న షోలలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. ఈవారం ఈ షో కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్‌. ఇందులో మొగలిరేకులు సీరియల్ లో పోలీస్ క్యారెక్టర్ తో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్కే నాయుడు ఎంట్రీ ఇస్తాడు. అనంతరం రియల్ లైఫ్ కపుల్స్ ఒకరి తర్వాత మరొకరు వాళ్ల‌ భాగస్వాములతో ఎంట్రీ ఇస్తూ ఉంటారు. వాళ్లతో పాటు ఇమ్మానుయేల్ – వర్ష‌ కూడా వస్తారు.

అయితే వాళ్ళిద్దరిది ఫస్ట్ నుంచి తెలిసిందే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ రియల్ జంటల మధ్యలో పండు – అరియానా రావటం కొంచెం ఆసక్తిగా మారింది. ఈ ఇద్దరి జంటని స్టేజ్ మీద చూసిన రష్మీ ఇదెప్పటినుంచి మీరిద్దరికి ఎప్పుడు ? స్టార్ట్ అయింది అని ఓపెన్ గా అడుగుతుంది. దీంతో అందరు ఒక్కసారిగా షాక్ అవుతారు.

వెంటనే పండు అరియానాను చూసి ఇష్టపడిన వాళ్ళు ఎవరు ? ఉంటారు చెప్పండి అంటూ పులిహార డైలాగులు మొదలు పెడతాడు. అరియానా కూడా పండు చెప్పకుండా వచ్చావు.. చెప్పకుండా వెళ్ళిపోవు కదా అని అంటుంది. దీనికి మన వాళ్లు లవ్ సాంగ్ వేసుకొని సింబల్ కూడా వేసేస్తారు.

దీనితో బుల్లితెరపై మరో జంట రచ్చ స్టార్ట్ అయిందని అనుకోవాలి. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో పిచ్చపిచ్చగా వైరల్ అవుతుంది. ఇక అరియానా కొద్ది రోజుల నుంచి ఒక వ్యక్తితో ప్రేమలో ఉందన్న వార్తలు వస్తున్నా ఆ వ్యక్తి పేరు బయటకు రావటం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news