Newsపెద‌రాయుడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మిస్ అయిన టాలీవుడ్‌ స్టార్ హీరో.... ప్లాప్...

పెద‌రాయుడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మిస్ అయిన టాలీవుడ్‌ స్టార్ హీరో…. ప్లాప్ అవ్వుద్ద‌ని చెప్పి మ‌రీ..!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కెరీర్ లో ఎప్పటికీ మరుపురాని సినిమాగా మిగిలిపోతుంది పెదరాయుడు. రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగులో ఏకంగా ఏడాదికి పైగా ఆడింది. మోహన్ బాబు ద్విపాత్రభినయం చేయగా రజనీకాంత్ కీలక పాత్రలో నటించారు. సౌందర్య, భానుప్రియ హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమా 1994లో కోలీవుడ్ లో వచ్చిన నట్టమై అనే సూపర్ హిట్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. అప్పటికే వరుస ప్లాపుల్లో ఉన్న మోహన్ బాబు ఒక్క హిట్ కోసం చ‌కోర పక్షుల్లా ఎదురుచూస్తున్నాడు.

ఈ సినిమా చేయమని రజనీకాంత్ స్వయంగా మోహన్ బాబు కి చెప్పడంతో పాటు తన మిత్రుడు కోసం రజని కీలక పాత్రలో నటించారు. తమిళంలో హీరోగా శరత్ కుమార్ నటించ‌గా… ప్రధాన పాత్రలో ప్రముఖునటుడు విజయ్ కుమార్ నటించారు. విజయ్ కుమార్ పాత్రని నేను చేస్తాను.. నువ్వు శరత్ కుమార్ పాత్రలో నటించు సినిమా సూపర్ హిట్ అవుతుంది.. నీ కెరీర్ బాగుపడుతుంది అని మోహన్ బాబుకి సలహా ఇచ్చి మరీ రీమేక్ చేయించాడు రజనీకాంత్. అయితే ఫలితం అందరూ ఊహించిన దాని కంటే అద్భుతంగా వచ్చింది.

సినిమా ఏకంగా 400 రోజులపాటు ఆడింది. సినిమాలో మోహన్ బాబు పాత్ర కంటే రజనీకాంత్ పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రజినీకాంత్ ఈ సినిమాలో నటించ‌డం వల్లే సినిమా మరో లెవెల్ కి వెళ్లిందని చెప్పాలి. ఈ సినిమాకు మోహన్ బాబు నిర్మాత కూడా..! అప్పట్లోనే ఈ సినిమా 15 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఐదు సంవత్సరాల వరకు ఈ సినిమా రికార్డులను ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. ఈ సినిమాని తొలుత ప్రముఖ నిర్మాత సురేష్ బాబు చూసి రీమేక్ రైట్స్ కొనుగోలు చేసి విక్టరీ వెంకటేష్ తో చేద్దాం అనుకున్నాడు.

ఒకసారి సినిమా చూడమని వెంకటేష్ కి చెప్పగా.. ఆ సినిమాలో పాత్రకు తాను సూట్ కానని సినిమా రీమేక్‌ చేసినా ప్లాప్ అవుతుందని వెంకటేష్ రిజెక్ట్ చేశాడు. వెంటనే మోహన్ బాబు ఈ సినిమా రైట్స్ కొని తెలుగులో చేసి తన కెరీర్ లోనే మరపురాని విజయాన్ని సొంతం చేసుకున్నాడు. విచిత్రం ఏంటంటే పెదరాయుడు వచ్చిన కొన్నాళ్లకే వెంకటేష్ ఇదే గెటప్ తో సూర్యవంశం సినిమా చేస్తే ఆ సినిమా సూపర్ హిట్ అయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news