Moviesసూప‌ర్‌హిట్ సినిమాలు చేస్తున్నా ఈ హీరోయిన్ల‌ను ద‌రిద్రం వెంటాడుతోందే…!

సూప‌ర్‌హిట్ సినిమాలు చేస్తున్నా ఈ హీరోయిన్ల‌ను ద‌రిద్రం వెంటాడుతోందే…!

చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఎవరు ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి.. వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలు వచ్చినా కూడా వారికి అదృష్టం కలిసి రాదు. మరి కొంతమందికి వరుస ప్లాప్‌లు వచ్చినా కూడా క్రేజీ ఆఫర్లు అందుకుంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇలాంటి సంఘటనలు బాగా జరుగుతూ ఉంటాయి. ఏదైనా సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ మొత్తం హీరోకి వెళ్తుంది. సినిమా ఫ్లాఫ్ అయితే మాత్రం ఆ భారం మొత్తం హీరోయిన్ మీదే పడుతుంది.

ఒకటి రెండు సినిమాలు హిట్ కాకపోతే ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా పక్కకు వెళ్లాల్సిందే. పోనీ వరుస విజయాలు వచ్చిన అవకాశాలు ఇస్తారా అంటే అది జరగదు. ప్రస్తుతం టాలీవుడ్ లో వ‌రుస‌ విజయాలు అందుకున్న హీరోయిన్లకు ఇప్పటికీ అవకాశాలు రావడం లేదు..కేజిఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి.. ప్రశాంత్ నీల్- య‌ష్‌ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎవరు ఊహించని రికార్డులను క్రియేట్ చేసింది.

ఇలాంటి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్న శ్రీనిధి పర్ఫామెన్స్ కు ప్రేక్షకుల సైతం ఫిదా అయ్యారు. అవకాశాలు వస్తాయని అనుకున్నారు కానీ కేజిఎఫ్ 2 సినిమా తర్వాత ఆ స్థాయిలో ఒక పెద్ద సినిమా కూడా రాలేదు. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కు జంటగా కోబ్రా సినిమాలో మాత్రం కనిపించింది. ఆ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక మరి ప్రస్తుతం వచ్చే సినిమాలు తో అయినా ఈమె ప్రేక్షకులను ఏ విధంగా ఆలరిస్తుందో చూడాలి. అయితే ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికీ ఆఫర్లు అయితే రావడం లేదు.

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన కంచే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్.. ఇక ఈ సినిమాలో తన అందంతో క్యూట్ లుక్స్ తో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా తర్వాత వరుసగా ఎన్ని సినిమాల్లో నటించినా అవి అంతగా ప్రేక్షకులను ఆక‌ట్టుకోలేక పోయ‌యి. ఇక చాలా కాలం తర్వాత బాలకృష్ణతో కలిసి అఖండ సినిమాలో నటించి భారీ విజయ అందుకుంది. అఖండ లాంటి భారీ విజయం తర్వాత కూడా ఈ భామకు స్టార్ హీరోలతో నటించే అవకాశాలు అయితే రావడం లేదు.

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస‌ విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్లలో సంయుక్త మీనన్ కూడా ఒకరు భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్.. ఈ సినిమాలో రానాకు జంటగా నటించింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ బింబిసార‌ సినిమాలో కూడా నటించింది. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టాయి. ఈ రెండు సినిమాలు తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో కలిసి సార్ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.

ఇక అలాగే మెగా హీరో సాయితేజ్ తో కలిసి విరూపాక్ష సినిమాలో నటించింది. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ విజయాలు అందుకున్న సంయుక్తకు మొన్నటి వరకు వరుస అవకాశాలు రాలేదు. ఇప్పుడు నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభూ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించే అవకాశం అందుకుంది. ఇలా వీరే కాకుండా దసరా లాంటి సూప‌ర్‌ హిట్ తర్వాత కీర్తి సురేష్‌కు, బేబీ సినిమా తర్వాత వైష్ణవి కి కూడా సరైన ఆఫర్లు అయితే రాలేదు. అన్నీ ఉన్న అదృష్టం లేకపోతే ఏది దక్కదంటారు. మరి ఆ అదృష్టం ఈ అందగత్తెలకు ఎప్పుడు అందుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news