MoviesTL రివ్యూ: గాండీవ‌ధారి అర్జున‌.. ఎప్పుడు డోర్లు తీస్తారా అని వెయిట్...

TL రివ్యూ: గాండీవ‌ధారి అర్జున‌.. ఎప్పుడు డోర్లు తీస్తారా అని వెయిట్ చేస్తారా..!

టైటిల్‌: గాండీవ‌ధారి అర్జున‌
స‌మ‌ర్ప‌ణ‌: భోగ‌వ‌ల్లి బాపినీడు
బ్యాన‌ర్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌
నటీనటులు: వ‌రుణ్‌తేజ్ – సాక్షివైద్య – విద్యాసాగ‌ర్ – విమ‌లారామ‌న్‌- విన‌య‌ర్‌రాయ్ – ర‌వివ‌ర్మ – క‌ల్ప‌ల‌త త‌దిత‌రులు
యాక్ష‌న్‌: హంగేరి, యూకే మాస్ట‌ర్స్‌
ఎడిట‌ర్‌: ధ‌ర్మేంద్ర కాక‌ర్ల‌
సినిమాటోగ్ర‌ఫీ: ముఖేష్ జి
మ్యూజిక్‌: మిక్కీ జే మేయ‌ర్‌
నిర్మాత‌: బీఎస్ఎన్‌వి. ప్ర‌సాద్‌
దర్శకుడు: ప్ర‌వీణ్ స‌త్తార్‌
రిలీజ్ డేట్‌: ఆగ‌స్టు 25, 2023
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
ర‌న్ టైం: 140 నిమిషాలు

గాండీవ‌ధారి అర్జున‌ ప‌రిచ‌యం:
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున. స్టైలిష్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ భారీ అంచనాలతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏజెంట్ భామ సాక్షి వైద్య హీరోయిన్గా నటించిన ఈ సినిమా అవుట్ అండ్ అవుట్‌ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కింది. అలాగే ఓ డిఫరెంట్ కాన్సెఫ్ట్‌తో తెరకెక్కింది. సీనియర్ నిర్మాత భోగవల్లి బాపినీడు నిర్మించిన ఈ సినిమాకు మిక్కిజే మేయర్ మ్యూజిక్ అందించారు. టీజర్ – ట్రైలర్లతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వరుణ్ తేజ్‌కు చాలా రోజుల తర్వాత సరైన హిట్ ఇచ్చిందో లేదో TL సమీక్షలో చూద్దాం.

TL స్టోరీ :
ఈ సినిమాలో అర్జున్ వర్మ ( వరుణ్ తేజ్ ) ఎక్స్ రా ఏజెంట్. అయితే కేంద్ర మంత్రి ఆదిత్య రాజ్ ( నాజర్ ) ప్రాణానికి ముప్పు ఉందని తెలియడంతో వరుణ్ తేజ్‌ను ఏజెంట్గా తీసుకుంటారు. నాజర్‌కు ఎవరు ? నుంచి ప్రాణహాని ఉంది. హీరోయిన్ ఐరా ( సాక్షి వైద్య ) తో కథ‌కు ఎలాంటి ? సంబంధం ఉంది.. మరి హీరో అర్జున్.. నాజర్‌ను కాపాడాడు లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

TL విశ్లేష‌ణ :
ఈ సినిమాలో హీరో వరుణ్ తేజ్ కథకు పెద్ద ప్లస్ పాయింట్. సినిమా మొత్తాన్ని తన నటన.. యాక్షన్ తో చాలా సింపుల్ గా ముందుకు నడిపించాడు. ఫైట్ సీన్లు ఆకట్టుకుంటాయి. హీరోయిన్ సాక్షి వైద్య గ్లామర్ తో పాటుగా పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. సినిమాలో మదర్ సెంటిమెంట్ బాగుంది. వరుణ్ తేజ్‌కి కల్ప‌లత మధ్యలో ఉన్న ఎమోషనల్ సీన్లు సినిమాను మంచి మూడ్లో నడిపిస్తాయి. మిక్కీ జే మేయర్ సినిమాలో మంచి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. చాలా సీన్లను బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ చేసింది.

సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా రిచ్ గా కనిపించింది. సినిమా కథ ఒక మోస్త‌రుగా ఉన్నప్పుడు డైరెక్టర్ తీసే తీతలో బాగా ఎలివేట్ చేయాలి. ఇక్కడ అదే మైనస్ అయ్యింది. తాను ఎంచుకున్న సబ్జెక్టు యావరేజ్‌గా ఉన్న సినిమా అంత ఎంగేజింగ్ గా లేదు. ఫస్టాఫ్ లో చాలా సీన్లు రొటీన్ గా ఉన్నాయి. చాలా అనవసర సైన్లు ఆడియన్స్ కి బోరింగ్ కలిగిస్తాయి. సినిమాలో మంచి మెసేజ్ అందించడానికి ట్రై చేసిన దానికి అనుగుణమైన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఇందులో లేదు.

గ్లోబల్ వార్మింగ్ ఇష్యూ అనేది ఎప్పటికీ ఒక హాట్‌ టాపిక్. అలాంటి సబ్జెక్టును డీల్ చేసేటప్పుడు ఆడియన్స్ ఎంగేజ్ అయ్యేలా మంచి ట్విస్టులు ఉండాలి. ఇందులో అలా జరగలేదు. సస్పెన్స్ – మిస్టరీ క్యారీ చేయలేదు. డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాతో అంచనాలు అందుకోలేకపోయాడు. మరో మంచి ప్రయత్నం చేసిన సరైన కథనం లేదు.. పాటలు ఒక యావరేజ్‌గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ ఆకట్టుకుంది. ఎడిటింగ్ చాలా సీన్లు ట్రిమ్ చేయాల్సి ఉన్నా ఎడిటర్ కత్తెరకు పని చెప్పలేదు.
నిర్మాణ విలువలు బాగున్నాయి.

గాండీవ‌ధారి అర్జున అంటూ ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ను అంతగా ఆకట్టుకోదు. కేవలం నటీనటుల పెర్ఫార్మన్స్ బాగుంది. నేపథ్య సంగీతంతో పాటు కొన్ని ఫైట్లు అలరిస్తాయి. అనవసర సన్నివేశాలు బోరింగ్ స్లోగా సాగే కథనం ఈ సినిమాను చాలా నిరాశకు గురి చేశాయి.

ఫైన‌ల్‌గా…
ఫైనల్ గా ఈ కథను కథనాన్ని ఎలా చెబితే నిర్మాత ఓకే చేశారు.. వరుణ్ తేజ్ అయిన ఎందుకు ?ఒప్పుకున్నాడు ఎవరికీ అర్థం కాదు. అసలు కథ‌ కథనాలు ఏంటో అర్థం కాక ప్రేక్షకులు అర్జునా ఫ‌ల్గునా అంటూ నిట్టూర్చాల్సిన పరిస్థితి.

గాండీవ‌ధారి అర్జున‌ ఫైన‌ల్ పంచ్ : దేవుడా ఏమిటీ చెత్త సందేశం

గాండీవ‌ధారి అర్జున‌ TL రేటింగ్‌: 2 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news