Moviesటాలీవుడ్‌ను ఊపేసిన స్టార్ హీరోయిన్ కూతురు వ‌స్తోంది... ఎంట్రీ ఇవ్వ‌కుండానే షేకింగ్‌

టాలీవుడ్‌ను ఊపేసిన స్టార్ హీరోయిన్ కూతురు వ‌స్తోంది… ఎంట్రీ ఇవ్వ‌కుండానే షేకింగ్‌

సాహస వీరుడు సాగరకన్య – ప్రేమఖైదీ – భలే మామయ్య లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది కన్నడ హీరోయిన్ మాలాశ్రీ. టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎదుగుతున్న సమయంలో కన్న‌డ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయింది. అప్పట్లో మాలాశ్రీకి ప్రత్యేకంగా అభిమానులు ఉండేవారు. ఆమె భారీ అందాలు.. కొంటెగా కవ్వించే తీరుకు అప్పటి తెలుగు యూత్ ఫిదా అయిపోయింది.

కన్నడ ఇండస్ట్రీలోకి వెళ్లిన ఆమె అక్కడ యాక్షన్ సినిమాల్లో చేస్తూ కన్నడ లేడీస్ సూపర్ స్టార్ గా ఎదిగింది. ఈమె తెలుగులో చివరిగా 1997 లో వచ్చిన సూర్య పుత్రులు సినిమాలో కనిపించింది. కన్నడలో నిర్మాత రాముతో ముత్యం లాంటి పెళ్ళాం సినిమా చేసిన మాలాశ్రీ అతడినే పెళ్లాడింది. రాము నిర్మాత, టాప్ డిస్టిబ్యూటర్. ఈ దంపతులకు అనన్య – అర్జున్ పిల్లలు ఉన్నారు. 2021 లో రాము కరోనాతో మృతి చెందారు. అప్పటినుంచి మాలాశ్రీ భర్తను తలుచుకుని ఎమోషనల్ అవుతూనే ఉంటుంది.

ఇది ఇలా ఉంటే మాలశ్రీ కూతురు అనన్య కూడా తల్లి అడుగుజాడల్లో నడిచేందుకు రెడీ అవుతోంది. కన్నడ స్టార్ దర్శన్ కొత్త సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటివరకు ఆమెను అనన్య – రాధాన అనే పేర్లతో పిలిచేవారు. అయితే తాజాగా తాను పేరు మార్చుకుంటున్నట్టు తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. హలో అందరికీ నా పేరు రాధాన రామ. మీ అందరికీ ఓ విషయం చెప్పాలి.. నేను పేరు మార్చుకున్నాను.. ఇకపై నా పేరు ఆరాధన.. ఈ మార్పు కోసం మీ ఆశీర్వచనాలు కోరుతున్నాను అని విజ్ఞ‌ప్తి చేసింది.

నాపై ఎంతగానో ప్రేమ మీ బాణాలు కురిపిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు అని రాసుకు వచ్చింది. ఇక నెటిజన్లు అయితే ఆరాధన పేరు కూడా ఎంతో అద్భుతంగా ఉంది.. నువ్వు కూడా నీ తల్లి లాగా స్టార్ హీరోయిన్ కావాలి.. సౌత్ ఇండియన్ సినీ అభిమానులను అలరించాలి అని శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఆరాధన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆమె అందాన్ని చూస్తున్న కుర్రకారు అయితే కచ్చితంగా ఆమె స్టార్ హీరోయిన్ అవుతుందని కామెంట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news