Moviesబాడిని స్ప్రింగ్ లా తిప్పేస్తున్న శ్రీలీల.. ఎన్టీఆర్ స్టెప్స్ డీట్టో దింపేసారుగా(వీడియో)!!

బాడిని స్ప్రింగ్ లా తిప్పేస్తున్న శ్రీలీల.. ఎన్టీఆర్ స్టెప్స్ డీట్టో దింపేసారుగా(వీడియో)!!

ప్రజెంట్ సినిమా అభిమానులు ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమాలలో వన్ ఆఫ్ ద టాప్ సినిమా “స్కంద” . రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ సినిమాని టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . ఈ క్రమంలోనే ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ పనులను మొదలు పెట్టేసింది .

అందులో భాగంగా రీసెంట్గా ఈ సినిమా నుంచి మంచి ఫాస్ట్ బీట్ తో ఉన్న సాంగ్ ని రిలీజ్ చేసింది . ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది . ఎంతలా అంటే ఆ బీట్స్ కి బాడీలో పూనకాలు వచ్చేలాగా ఊగిపోతున్నారు . అంతేకాదు ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో మంచిగా డ్యాన్స్ చేసి ఆకట్టుకున్న పాట రానే రాలేదని చెప్పాలి. అయితే అలాంటి వాళ్లకు ఈ పాట మంచి కిక్కిస్తుంది.

ఈ పాటలో రామ్ పోతినేని – శ్రీ లీల యమ రేంజ్ లో డాన్స్ స్టెప్స్ ఇరగదీశారు. క్లాస్ మాస్ అని తేడా లేకుండా ఓ రేంజ్ లో దుమ్ము దులిపేశారు. మరి ముఖ్యంగా శ్రీ లీల ఈ పాటలో హాట్ గానే కాదు సెక్సీ గా కనిపిస్తూ బాడీని స్ప్రింగ్ లా తిప్పేస్తూ డాన్సులు వేసింది . అయితే రామ్ పోతినేని వేసిన స్టెప్స్ చూస్తే మాత్రం అందరికీ యమదొంగాలో ఎన్టీఆర్ “నా చొరే నా చొరే” లో వేసిన స్టెప్స్ గుర్తొస్తాయి. అంతేకాదు జై లవకుశ సినిమాలో “ట్రింగ్ ట్రింగ్” సాంగ్ స్టెప్స్ కూడా లేపేసి మరి ఇక్కడ పేస్ట్ చేసినట్లు క్లియర్ గా తెలిసిపోతుంది. అయినా కానీ ఈ పాటను అభిమానులు బాగా ఆదరిస్తున్నారు . ఈ సాంగ్ సినిమాకి హైలైట్ గా మారిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news