Moviesతెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న 'ఈ నగరానికి ఏమైంది..' చిన్నారి.....

తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది..’ చిన్నారి.. హీరో ఎవరంటే..?

మనం థియేటర్స్ కి వెళ్ళగానే ఎంత పెద్ద సినిమా అయినా సరే స్క్రీన్ ఆన్ అవగానే మొదట ప్రసారమయ్యేది ఓ యాడ్ . “ఈ నగరానికి ఏమైంది.. ఒకవైపు నుసి.. మరోవైపు పొగ.. ఎవరు నోరు మెదపరేంటి” అంటూ గంభీరమైన గొంతుతో వచ్చే యాడ్ కనిపిస్తుంది . ఈ యాడ్లో ఓ తండ్రి పక్కనే అమాయకంగా కూర్చుని ఓ చిన్నారి పాప ఉంటుంది. ఈ చిన్నారి పాప చాలా క్యూట్ గా ఉంటుంది . ఆ చిన్నారి పాప పేరే సిమ్రాన్ నటేకర్.

అయితే ఆ యాడ్లో చాలా చిన్నగా క్యూట్ గా ఉన్న ఈ పాప ఇప్పుడు పెద్దదయింది. హీరోయిన్గా కూడా ఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన పిక్స్ మిగతా డీటెయిల్స్ వైరల్ గా మారాయి . అయితే తెరపై ఈ పాపను చూసిన వాళ్ళు ఇప్పుడు హీరోయిన్గా చూస్తామని అనుకోరు. ఎందుకంటే ఆ యాడ్ కొన్ని ఏళ్ల నుంచి అలాగే ప్రసారం అవుతుంది . అయితే ఆ పాప మాత్రం పెద్దది అయిపోయింది , ఇప్పుడు చూడడానికి హాట్ హీరోయిన్ లా ఉంటుంది ఈ చిన్నారి .

సిమ్రాన్ నటేకర్ కి ఇప్పుడు పాతికేళ్లు . వరుసగా హిందీ చిత్రాలలో పలు పాత్రలు చేస్తూ బిజీగా మారిపోయింది. 1997లో సిమ్రాన్ నటేకర్ ముంబైలో జన్మించింది . ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు యాడ్స్ లో నటించింది . ఈ పాప 15ఒ యాడ్స్ కి పైగానే నటించింది. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లో సైతం నటించి శభాష్ అనిపించుకుంది . క్రిష్ త్రీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించి సూపర్ క్రేజీ బ్యూటీగా మారిపోయింది.

అయితే ఇప్పుడు అమ్మడు హీరోయిన్గా ప్రయత్నిస్తుంది . సోషల్ మీడియాలో ఆమె లేటెస్ట్ ఫోట్స్ చూస్తే మాత్రం కుర్రాళ్ళ మతులు పోవాల్సిందే . తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్లోకి ఈమె హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఓ బడా నిర్మాణ సంస్థ ఆడిషన్ లో ఈ అమ్మడు సెలెక్ట్ అయిందట. త్వరలోనే ఓ యంగ్ హీరో సినిమాలో హీరోయిన్గా కనిపించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news