Movies' స్కంధ ' ప్రి రిలీజ్ బిజినెస్‌… బోయ‌పాటి దెబ్బ‌తో రామ్...

‘ స్కంధ ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌… బోయ‌పాటి దెబ్బ‌తో రామ్ ఎక్క‌డికో వెళ్లిపోయాడు…!

టాలీవుడ్ ఎనర్జిటిక్ రామ్ వరుస ప్లాపుల నుంచి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కాస్త ఉపశమనం పొందాడు. గత ఏడాది చేసిన ది వారియర్ సినిమా డిజాస్టర్ అయినా ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ నటిస్తున్న స్కంధ‌ సినిమాపై అటు సినీ అభిమానులతో పాటు టాలీవుడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. పైగా బోయపాటి నుంచి అఖండలాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావటం.. ఇటు శ్రీలీలా స్పెషల్ ఎట్రాక్షన్ కావడంతో స్కంధ‌ అంచనాలు ఆకాశంలో ఉన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. సెప్టెంబర్ 15న స్కంధ‌ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా అన్ని ఏరియాలలో హోరెత్తిపోతుంది. నిర్మాత చిట్టూరి శ్రీను ఈ సినిమా రైట్స్ తన రెగ్యులర్ బయ్యర్లకి ఇచ్చేలా ఉన్నారు. ప్రస్తుతానికి ఆంధ్ర ఏరియాకు రు. 25 కోట్ల మేర డిస్కషన్లు నడుస్తున్నట్లు తెలుస్తోంది.

బోయపాటి – రామ్ – శ్రీలీలా ఇలా క్రేజీ కాంబినేషన్ కావడంతో ఆంధ్ర ఏరియాకు రు. 25 కోట్లు అంటే కేక్ వాక్‌ అని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇక ఉత్తరాంధ్ర రైట్స్ రు. 6 కోట్ల రేంజ్ లో అమ్ముతారని సమాచారం. ఇక నైజాం సిటీ రైట్స్ కోసం గట్టి పోటీ నెలకొని ఉంది. ఓవరాల్ గా చూస్తుంటే స్కంధ‌ ఏపీ – తెలంగాణ ఫ్రీ రిలీజ్ బిజినెస్ రు. 70 కోట్లకు పైగానే జరిగేలా ఉంది. ఏదేమైనా బోయ‌పాటి – శ్రీలీల ఎఫెక్ట్‌తో రామ్ రేంజ్ ఎక్క‌డికో వెళ్లిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news