MoviesTL రివ్యూ: జైల‌ర్‌.. ర‌జ‌నీ ఇది హిట్టు సినిమాయా...!

TL రివ్యూ: జైల‌ర్‌.. ర‌జ‌నీ ఇది హిట్టు సినిమాయా…!

టైటిల్‌: జైల‌ర్‌
నటీనటులు: ర‌జ‌నీకాంత్‌, ర‌మ్య‌కృష్ణ‌, త‌మ‌న్నా, మోహ‌న్‌లాల్‌, జాకీష్రాఫ్‌, శివ‌రాజ్‌కుమార్‌, వినాయ‌క‌న్‌, సునీల్‌, యోగిబాబు త‌దిత‌రులు
యాక్ష‌న్‌: స్ట‌న్ శివ‌
ఎడిట‌ర్‌: ఆర్‌. నిర్మ‌ల్‌
సినిమాటోగ్ర‌ఫీ: విజ‌య్ కార్తీక్‌
మ్యూజిక్‌: అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌
నిర్మాణం: స‌న్ పిక్చ‌ర్స్‌
దర్శకుడు : నెల్స‌న్ దిలీప్‌కుమార్‌
రిలీజ్ డేట్‌: ఆగ‌స్టు 10, 2023
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
ర‌న్ టైం: 169 నిమిషాలు

జైల‌ర్ ప‌రిచ‌యం:
సౌత్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్ గ‌త కొంత కాలంగా వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నా ఆ సినిమాలు ర‌జ‌నీ రేంజ్ అంచ‌నాలు అందుకోలేక‌పోతున్నాయి. రోబో, 2.0 సినిమాలు మిన‌హా ఈ ప‌దేళ్ల‌లో ర‌జ‌నీ న‌టించిన సినిమాలేవి నిర్మాత‌ల‌కు లాభాలు తెచ్చిపెట్ట‌లేదు. ఇటు ఆయ‌న అభిమానుల‌కు కిక్ కూడా ఇవ్వ‌లేదు. ఈ క్ర‌మంలోనే ర‌జ‌నీ తాజా చిత్రం జైల‌ర్‌తో ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఆక‌ట్టుకోవ‌డంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తమన్నా భాటియా మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్‌కుమార్ లాంటి భారీ తారాగ‌ణం న‌టించిన ఈ సినిమాలో ర‌జ‌నీ భార్య‌గా సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ న‌టించింది. సినిమాపై రిలీజ్‌కు ముందు ఉన్న అంచ‌నాలు జైల‌ర్ అందుకుందా ? ర‌జ‌నీకి రోబో త‌ర్వాత త‌న రేంజ్ హిట్ జైల‌ర్ ఇచ్చిందో లేదో జైల‌ర్ TL స‌మీక్ష‌లో చూద్దాం.

TL స్టోరీ :
ముత్తు వేలు పాండియన్ ( రజనీకాంత్ ) ఒక స్ట్రిక్ట్ రూల్స్ పాటించే జైలర్ గా ఉంటాడు. ప్రస్తుతం తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాడు. తన మనవడుతో సరదాగా ఆడుకుంటూ ఉంటాడు. అయితే పోలీస్ అధికారి అయిన ముత్తు కొడుకు ఏసీపీని చంపేస్తారు. తన కొడుకు చావుకు ప్రతీకారంగా ముత్తు వరుసగా హత్యలు చేయడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటికీయ‌ పరిణామాలు నేపథ్యంలో ముత్తు ఫ్యామిలీ ఆపదలో చిక్కుకుంటుంది. తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ముత్తు ఏం చేశాడు ? తన కుటుంబాన్ని చంపాలని ప్రయత్నిస్తున్న వారిపై ముత్తు ఎలా ? ప్రతీకారం తీర్చుకున్నాడు. చివరకు ముత్తు తాను అనుకున్నది సాధించాడా ? లేదా ఇంతకీ ముత్తు కొడుకు నిజ స్వరూపం ఏమిటి ? అసలు ఈ సినిమాలో రమ్యకృష్ణ, తమన్న పాత్రలు ఏంటనేదే ఈ సినిమా.

TL విశ్లేష‌ణ :
జైలర్‌ పాత్రలో సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులను అల‌రించాడనే చెప్పాలి. పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు అదిరిపోయే ఎమోషన్ సీన్ల‌లోను మెప్పించాడు. పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ రజ‌ని నటించిన విధానం ఆకట్టుకుంది. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో పాటు కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు.. ఫ్లాష్ బ్యాక్ సీన్లలో తన స్టైలిస్ట్ లుక్స్ తో రజని చాలా బాగా నటించాడు. ఇక అతిధి పాత్రలో కనిపించిన మోహన్‌లాల్ – శివరాజ్ కుమార్ – జాకీష్రాక్ కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యారు. మరో కీలక పాత్రలో నటించిన తెలుగు కమెడియన్ సునీల్ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు.

తల్లి పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయింది. తమన్నా స్పెషల్ సాంగ్‌కు థియేటర్లలో కంటిన్యూస్‌గా విజిల్స్ వేయించింది. యోగిబాబుతో పాటు మిగిలిన నటీనటులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న కొన్ని యాక్షన్ సీన్లు తెరమీద బాగా సెట్ అయ్యాయి.
సినిమాలో యాక్షన్ – ఎమోషన్ సీన్ల‌ను దర్శకుడు బాగా ప్రజెంట్ చేసిన.. అలాగే ఫ్లాష్ బ్యాక్ ను బాగా డిజైన్ చేసుకున్నా అంతే స్థాయిలో ట్రీట్మెంట్ రాసుకోలేదు. ముఖ్యంగా కథనం చాలా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. నెల్సన్ తన గత సినిమాల శైలీలోనే ఈ సినిమాను కూడా నడిపించాడు.

కొన్ని సన్నివేశాలు మినహా ఎక్కడ ఫ్రెష్‌నెస్‌ చూస్తున్న ఫీల్ అయితే కనిపించదు. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ను వేగంగా నడిపిన నెల్సన్ సెకండాఫ్ ను బాగా సాగదీశాడు. ఇది సినిమా ఫలితంపై ప్రభావం చూపింది. ఒక్క క్లైమాక్స్‌లో తప్ప సెకండాఫ్ మిగిలిన కథనంలో ఉచ్చుకతను ఉత్కంఠను పెంచడంలో నెల్సన్ విఫలమయ్యాడు. స్క్రీన్ ప్లే ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా రాసుకునే అవకాశం ఉన్నా తన పాత సినిమాల‌ శైలీలోనే సినిమాని ముగించేశాడు.

ముఖ్యంగా కథనం మ‌లుపు తిప్పే ప్రధాన పాత్ర రజ‌నీ కొడుకు పాత్రను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. అప్పుడు ఆ పాత్రకి ఇంకా బాగా న్యాయం జరిగినట్టు ఉండేది. ఓవరాల్ గా జైలర్ సినిమాలో బలమైన ఎమోషన్ కాంప్లెక్ట్ ఉన్నా… ఆ ఎమోషన్ లో ప్రేక్షకులు ఇన్వాల్వ్ అయ్యేంతగా ఎస్టాబ్లిష్మెంట్ అయితే జరగలేదు. రజ‌ని అభిమానుల మీద మినహా కామన్ ఆడియన్స్ అయితే.. సెకండ్ హాఫ్ విషయంలో చాలా అసహనానికి అసంతృప్తికి గురవుతారు.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే…
టెక్నికల్ గా చూస్తే సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రన్ అందించిన‌ మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా చాలా సన్నివేశాల్లో నేపథ్య‌ సంగీతంతో సీన్లు చాలా బాగా ఎలివేట్ అయ్యాయి. విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్గా నిలుస్తుంది. విజువల్స్ అదిరిపోయాయి. ఎడిటింగ్ బాగున్న సెకండాఫ్ లో సాగదీత సీన్లు మరింత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఇక కళానిధి మారన్ నిర్మాణ విలువలు అదిరిపోయాయి. సినిమా అంతా గ్రాండ్ గా ఉంది.

ఇక దర్శకుడు నెల్సన్ విషయానికి వస్తే సినిమాకి న్యాయం చేసినా రచయితగా మాత్రం ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఇంత గొప్ప స్టార్ కాస్టింగ్.. ఇంత భారీ బడ్జెట్ ఉన్నా కూడా చిత్రాన్ని ఉత్కంఠగా రేసీగా తెరకెక్కించటంలో విఫలమయ్యాడని చెప్పాలి. కథనం మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఓవరాల్ గా సినిమా రజ‌నీ అభిమానులకు బాగా నచ్చుతుంది.. కామన్ ఆడియన్స్ ను ఒక మోస్త‌రుగా మాత్రమే ఎంగేజ్ చేస్తుంది.

ఫైన‌ల్‌గా…
జైలర్‌లో రజినీకాంత్ నటన, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ గెస్ట్ అప్పీరియన్స్, యాక్షన్ సీన్లు సూప‌ర్‌. అయితే బ‌ల‌మైన ఎమోష‌న్ కాన్‌ఫ్లిక్ట్ ఉన్నా ప్రేక్ష‌కులు స‌రిగా ఇన్వాల్ కాలేదు. రెగ్యులర్ ప్లే, బోరింగ్ ట్రీట్మెంట్ సినిమా అంచనాలు స‌గం వ‌ర‌కే అందుకునేలా చేసింది.

జైల‌ర్‌ ఫైన‌ల్ పంచ్ : ర‌జ‌నీ ఫ్యాన్స్‌కు హిట్టు… కామ‌న్ ఆడియెన్స్‌కు యావ‌రేజూ..

జైల‌ర్‌ రేటింగ్‌: 2.5 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news