Moviesమళ్లీ పవన్ అన్నని వాడుకుంటున్న నితిన్ "తమ్ముడు".. హిట్ కోసం ఫ్యాన్స్...

మళ్లీ పవన్ అన్నని వాడుకుంటున్న నితిన్ “తమ్ముడు”.. హిట్ కోసం ఫ్యాన్స్ కి బిస్కెట్ వేస్తున్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నితిన్ ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ముందుకు దూసుకెళ్తున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అఫ్కోర్స్ ప్రజెంట్ నితిన్ ఖాతాలో పెద్దగా చెప్పుకోతగా సినిమాలు హిట్ ట్రాక్ లేదు. అయినా సరే నెక్స్ట్ సినిమాలను మాత్రం క్రేజీ క్రేజీ డైరెక్టర్లతో కమిట్ అయి ఉన్నాడు. ఇప్పటికే వెంకి కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా ..ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ అనే సినిమాలో బిజీ బిజీగా ఉన్న నితిన్ రీసెంట్గా మరో సినిమాకి కమిట్ అయ్యాడు.

పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమా అందుకున్న వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈయన సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాని దిల్ రాజు గారు నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . నితిన్ నెక్స్ట్ సినిమాను వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేయబోతున్నారని ట్విట్ చేశారు . అంతేకాదు హ్యాష్ ట్యాగ్ తమ్ముడు అని ట్యాగ్ కూడా చేశారు .

ఈ క్రమంలోనే మరోసారి నితిన్ పవన్ కళ్యాణ్ ని వాడుకోబోతున్నాడు అని పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆయన తమ్ముడు సినిమా టైటిల్ గా పెట్టుకోబోతున్నాడు అని తెలుస్తుంది . “కొన్ని టైటిల్స్ మనకి ఎంతో రెస్పాన్సిబులిటీ ని క్రియేట్ చేస్తాయి. వాటిని రీచ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము” అంటూ వేణు శ్రీరామ్ దిల్ రాజు తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు . సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. అయితే హిట్ లేని ఈ హీరో పవన్ కళ్యాణ్ ని క్రేజు ని వాడుకుని హిట్ కొట్టబోతున్నాడని ట్రోల్ చేస్తున్నారు జనాలు..!!

Latest news