Moviesచాలా రోజుల‌కు హ‌రీష్ జైరాజ్ సాంగ్‌… విన‌డానికి హాయీగా నితిన్ '...

చాలా రోజుల‌కు హ‌రీష్ జైరాజ్ సాంగ్‌… విన‌డానికి హాయీగా నితిన్ ‘ డేంజ‌ర్ పిల్లా ‘ సాంగ్ ( వీడియో)

యంగ్ హీరో నితిన్ – శ్రీలీల కాంబినేషన్ లో స్టార్ రైట‌ర్‌, డైరెక్ట‌ర్ వక్కంతం వంశీ అందిస్తున్న సినిమా ఎక్స్ ట్రా.. ఆర్డినరీ మాన్. ఈ సినిమా విష‌యంలో నితిన్ చాలా క‌సితో ఉన్న‌ట్టే క‌నిపిస్తోంది. ఎప్పుడో డిసెంబ‌ర్లో రిలీజ్ అంటున్నారు. కానీ ప్ర‌మోష‌న్ యాక్టివిటీ అయితే ఇప్ప‌టి నుంచే మొద‌లు పెట్టేశారు. ఇప్ప‌టికే ఫ‌స్ట్ సాంగ్ వ‌చ్చింది. చాలా రోజుల త‌ర్వాత తెలుగులో హ‌రీష్ జైరాజ్ నుంచి అదిరిపోయే ఆల్బ‌మ్ రాబోతోంద‌ని ఫ‌స్ట్ సాంగ్ చెప్పేసింది.

మ‌నం కూడా హారిష్ టిపికల్ ట్యూన్ లు విని చాలా రోజులు అయ్యింది. డేంజ‌ర్ పిల్లా అనే హుక్ లైన్‌తో వ‌చ్చిన ఈ పాట‌ను ఆర్మాన్ మాలిక్ పాడారు. కృష్ణకాంత్ రచనతో పాటు పాట కొత్తగా వుంది.. ఇక హ‌రీష్ జై రాజ్ ట్యూన్ అయితే వింటున్న కొద్ది వినాల‌నేలా ఉంది. టోట‌ల్ ఆల్బ‌మ్‌లోనే ఇది మంచి పాట‌గా ఉండబోతోంది. ఇక విజువ‌ల్స్ చూస్తుంటే రేపు తెర‌మీద కూడా చక్క‌గా వినిప‌సొంపుగా ఉండేలా ఉంది.

హ‌రీష్ ఇచ్చిన ట్యూన్ లో వెర్సటాలిటీ వుంది. ఈ సాంగ్ కచ్చితంగా సినిమాకు ప్లస్సే అవుతుంది. శ్రీలీల, నితిన్ జోడీతో పాటు పాట కోసం తీసుకున్న బ్యాక్ గ్రవుండ్ టీమ్, లోకేషన్లు కూడా పాటకు చాలా అంటే చాలా ప్లస్ అయ్యాయి. ఇక వ‌క్కంతం వంశీ నాలుగేళ్ల క్రింద‌ట బ‌న్నీ హీరోగా చేసిన నాపేరు నా సూర్య నా ఇళ్లు ఇండియా త‌ర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని చేస్తోన్న సినిమా ఇదే.

ఇక నితిన్ కూడా చిన్న లూప్ హోల్ లేకుండా స్క్రిఫ్ట్‌తో పాటు సినిమా మీద ప‌క్క‌గా వ‌ర్క్ చేస్తున్నాడు. అందుకే చాలా టైమ్ కూడా తీసుకుంటున్నాడు. అందుకే డిసెంబ‌ర్లో రిలీజ్ అంటున్నా కూడా ఆగ‌స్టు నుంచే ప్ర‌మోష‌న్ వ‌ర్క్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాకు నిర్మాత సుధాకర్ రెడ్డి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news