Newsఆ స్టార్ హీరోతో డేటింగ్ కోరిక బ‌య‌ట పెట్టిన నిధి అగ‌ర్వాల్‌..!

ఆ స్టార్ హీరోతో డేటింగ్ కోరిక బ‌య‌ట పెట్టిన నిధి అగ‌ర్వాల్‌..!

టాలీవుడ్ లోకి నాగచైతన్య హీరోగా వచ్చిన సవ్యసాచి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. ఆ సినిమా అంచనాలు అందుకోలేదు. ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలతో కూడా ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో నిధి అగర్వాల్ తెలుగులో బాగా క్రేజీ హీరోయిన్ అయింది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో బిజీగా ఉంది. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ అయ్యి ఉంటే నిధి కెరీర్ మరోలా ఉండేది. ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వటం కూడా ఆమెకు కాస్త మైనస్ అని చెప్పాలి. ఇదిలా ఉంటే నిధి అగర్వాల్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

గతంలో ఓ ఇంటర్వ్యూలో నిధి మాట్లాడుతూ తన తొలిప్రేమ డేటింగ్ పై ఆసక్తికర విషయాలు పంచుకుంది. నిధి 4వ తరగతి చదువుతున్నప్పుడే తన స్నేహితుడిపై క్రష్ ఉండేదని.. అయితే అది ఆకర్షణ మాత్రమే అన్న విషయం తర్వాత అర్థమైందని.. తన తొలిప్రేమ గురించి తెలిపింది. అయితే ఆ అబ్బాయి ఇప్పటికీ మంచి స్నేహితుడు గానే ఉన్నాడు అని నీధి చెప్పింది.

కొంచెం పెద్దయ్యాక అబ్బాయితో డేట్‌కు వెళ్లానని తనకు తొలి వాలంటైన్‌ ప్రపోజ్ చేసింది కూడా అతడే అని చెప్పుకొచ్చింది. ఇక హీరోలలో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ తన ఫస్ట్ క్రష్ అని.. వీలైతే ఆయనతో డేటింగ్ కు వెళ్తా అంటూ నవ్వుతూ చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news