Moviesనంద‌మూరి హీరో దిగుతుండు... క‌ళ్యాణ్‌రామ్ ' డెవిల్ ' రిలీజ్ డేట్...

నంద‌మూరి హీరో దిగుతుండు… క‌ళ్యాణ్‌రామ్ ‘ డెవిల్ ‘ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

నందమూరి యంగ్, టాలెంటెడ్ హీరో కళ్యాణ్ రామ్ గ‌తేడాది త‌న కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ బింబిసార త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా క‌ళ్యాణ్‌రామ్ కెరీర్‌లో ఫ‌స్ట్ టైం రు. 50 కోట్ల సినిమాగా నిలిచింది. ఈ సినిమా త‌ర్వాత క‌ళ్యాణ్ వ‌రుస‌గా ప్రయోగాత్మ‌క సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ యేడాది మూడు వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో అమిగోస్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.

ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను అంత‌గా ఆక‌ట్టుకోలేదు. ఇక ఇప్పుడు ప్రయోగాత్మ‌కంగా చేస్తోన్న మ‌రో సినిమా డెవిల్‌. టీజర్ తో సాలిడ్ బజ్ అందుకున్న ఈ సినిమా భారీ హంగులతో పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక మేక‌ర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. ఈ ఏడాది నవంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అక్టోబ‌ర్ 19న బాల‌య్య భ‌గ‌వంత్ కేస‌రి ఉంది. ఆ మ‌రుస‌టి నెల‌లో డెవిల్ వ‌స్తుండ‌డంతో నంద‌మూరి ఫ్యాన్స్‌కు అంత‌క‌న్నా జోష్ ఏముంటుంది. ఇక ఓ ప్రముఖ స్పై జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news