Moviesనందమూరి తారకరత్న ఫ్యామిలీలో నేడు ఏంతో స్పెషల్ డే.. భర్తను...

నందమూరి తారకరత్న ఫ్యామిలీలో నేడు ఏంతో స్పెషల్ డే.. భర్తను గుర్తు చేసుకుని కుమిలిపోతున్న అలేఖ్యరెడ్డి..!!

నందమూరి హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న తారకరత్న రీసెంట్ గానే మరణించిన విషయం మనకు తెలిసిందే. ఫిబ్రవరి 22న గుండె సంబంధిత సమస్యతో మరణించాడు. ఆయన మరణం విషయం ఇప్పటికి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.. నందమూరి తారకరత్న మన మధ్య ఉన్నాడు అంటూ చెప్పుకొస్తున్నారు . నందమూరి తారకరత్న అభిమానులకు ఓ జ్ఞాపకంలా మారిపోయారు . ఆయన మరణించిన విష్యాని తారకరత్న అభిమానులు మర్చిపోలేక పోతున్నారు.

నారా చంద్రబాబునాయుడు కొడుకు లోకేష్ యువ్వగలం పేరుతో చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న కుప్పకూలిపోయారు . ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో గుండెనొప్పి వచ్చింది . ఆ తర్వాత బెంగళూరులోని హృదయాలయ హాస్పిటల్ చికిత్స తీసుకుంటూ ఆయన తుది శ్వాస విడిచారు . ఆ టైంలో ఆయన భార్య పిల్లలు విలపించిన దృశ్యాలు ఇప్పటికీ మన కళ్ళముందే మెదులాడుతూ ఉంటాయి . కాగా నేడు తారకరత్న కొడుకు కూతురు పుట్టిన రోజు.

తారకరత్నకు కవల పిల్లలు ఉన్న విషయం తెలిసిందే . తన్యారామ్ , రేయ . ఈరోజు వాళ్ళ పుట్టినరోజు. దీంతో అలేఖ్య రెడ్డి .. తారకరత్న ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. తారకరత్న తో వాళ్లకున్న అనుబంధాన్ని ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ గా స్పందించింది. . ఈ సంతోషకర సమయంలో ఎంత ప్రయత్నించినా నవ్వడం నా వల్ల కావడం లేదు..మన బిడ్డలకి ఆనందంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేకపోతున్నాను .. నువ్వు నా పక్కనే ఉండి ఉంటే చాలా ఆనందంగా ఉండేది . కానీ పిల్లల సంతోషం రూపంలో నువ్వు ఎప్పుడూ నాతోనే ఉన్నావు అనుకుంటున్నాను ” అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ నోట్ షేర్ చేసింది అలేఖ్య రెడ్డి. దీంతో మరోసారి సోషల్ మీడియాలో నందమూరి తారకరత్న పేరు ట్రెండ్ అవుతుంది..!!

Latest news