Moviesఫ్యాన్స్ కోపం చ‌ల్లార్చేందుకు మ‌హేష్ ఏం చేశాడో చూడండి…!

ఫ్యాన్స్ కోపం చ‌ల్లార్చేందుకు మ‌హేష్ ఏం చేశాడో చూడండి…!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు హీరోగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమా గుంటూరు కారం. శ్రీలీల‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ సినిమాను వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. థ‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ భారీ ప్రాజెక్టుకు సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మాత‌గా ఉన్నారు. ఇక తెర‌వెన‌క త్రివిక్ర‌మ్ పెట్ట‌బ‌డుల గురించి కొత్త‌గా చెప్పేదేం ఉంది..!

ఇక ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి వెకేష‌న్ల‌కు వెళ్లిన మ‌హేష్‌బాబు ఇప్పుడు తిరిగి షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. మ‌హేష్ జిమ్‌లో వ‌ర్క‌వుట్లు చేస్తూ ఉన్న ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ వ‌ర్క‌వుట్ల ఫొటోల‌ను మ‌హేష్ ఇన్‌స్టాలో షేర్ చేయ‌గా అవి ఇప్పుడు ఒక రేంజ్‌లో వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

మ‌హేష్ ఈ వ‌ర్క‌వుట్ల కోసం బాగా క‌ష్ట‌ప‌డుతున్న‌ట్టుగా ఉన్నాడు. అలాగే చాలా స్లిమ్ లుక్ మెయింటైన్ చేస్తున్న‌ట్టుగా కూడా ఉంది. అత‌డు, ఖ‌లేజా సినిమాల త‌ర్వాత మ‌హేష్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో వ‌స్తోన్న ఈ సినిమాపై అంచ‌నాలు మామూలుగా లేవు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ బాగా ఆల‌స్యం అవుతుంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తోన్న నేప‌థ్యంలో మేక‌ర్స్ ఇలాంటి స్టిల్స్ వ‌దులుతూ .. లేదా మ‌హేష్‌తో పోస్ట్ చేయిస్తూ ఫ్యాన్స్ కోపాన్ని కంట్రోల్ చేస్తున్న‌ట్టుగా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news