Newsజైల‌ర్ డే 1 వ‌సూళ్లు... రు. 100 కోట్ల‌తో ర‌జ‌నీ స‌త్తా...!

జైల‌ర్ డే 1 వ‌సూళ్లు… రు. 100 కోట్ల‌తో ర‌జ‌నీ స‌త్తా…!

కోలీవుడ్ త‌లైవా.. సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ న‌టించిన జైల‌ర్ సినిమా నిన్న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో ర‌మ్య‌కృష్ణ‌, త‌మ‌న్నా న‌టించారు. ఇక త‌మ‌న్నా డ్యాన్స్ చేసిన కావాల‌యా.. నువ్ కావాల‌యా సాంగ్ అయితే సినిమా రిలీజ్‌కు ముందు ఎలా ఊపిందో.. సినిమాపై ఎంత హైప్ క్రియేట్ చేసిందో చూశాం.

ఈ క్ర‌మంలోనే భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 100 కోట్లు కొల్ల‌గొట్టింది. 2023లో ఇండియాస్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సినిమాల‌లో జైల‌ర్ మూడో స్థానంలో నిలిచింది. మొద‌టి ప్లేస్‌లో ప్ర‌భాస్ ఆదిపురుష్‌, రెండో స్థానంలో షారుక్ ప‌ఠాన్ సినిమాలు ఉన్నాయి. అయితే కోలీవుడ్ ప‌రంగా చూస్తే జైల‌ర్ సినిమాయే ఫ‌స్ట్ ప్లేసులో ఉంది.

గురువార‌మే క‌లెక్ష‌న్లు ఇలా ఉంటే ఇక శుక్ర, శ‌ని, ఆదివారం ఏ రేంజ్‌లో ఉంటాయో చెప్ప‌క్క‌ర్లేదు. ఇక సినిమాకు మౌత్ టాక్‌బాగా స్ప్రెడ్ అవుతోంది. గురువారంతో పోలిస్తే శుక్ర‌వారం థియేట‌ర్ల కౌంట్ పెంచారు. ఏపీ, తెలంగాణ‌లోనే థియేట‌ర్లు పెరుగుతున్నాయంటే ఇక జైల‌ర్ మానియా ఇక్క‌డ కూడా ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

యూఎస్ మార్కెట్లో ఫ‌స్ట్ డే 1.4 మిలియ‌న్ డాల‌ర్లు కొల్ల‌గొట్టిన ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ ఫ‌స్ట్ డేకే 55 శాతం బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇక ఫ‌స్ట్ వీకెండ్‌కే 80 శాతం బ్రేక్ ఈవెన్ అవుతుంద‌ని లెక్క‌లు వేస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news