Newsశ్రీలీలకు ఇండస్ట్రీలో ఇంత పెద్ద ఆఫర్లు రావడానికి కారణం ఆ హీరోనా..?...

శ్రీలీలకు ఇండస్ట్రీలో ఇంత పెద్ద ఆఫర్లు రావడానికి కారణం ఆ హీరోనా..? బయటపడ్డ సంచలన నిజం..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీ గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల పేరు ఎలా యమ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు బాగా తెలిసిన విషయమే. ప్రజెంట్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తెరకెక్కుతున్న భారీ భారీ సినిమాలలో హీరోయిన్గా నటిస్తుంది శ్రీ లీలానే కావడం గమనార్హం. ఇలాంటి క్రమంలోనే అసలు ఎటువంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రీలీలకు ఇలాంటి క్రేజీ ఆఫర్స్ ఎలా వస్తున్నాయి అన్నదానిపై ఇంట్రెస్టింగ్ చర్చలు మొదలయ్యాయి .

అయితే కన్నడ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న యాష్ ఆమెకు అవకాశాలు రావడానికి కారణం అంటూ తెలుస్తుంది. శ్రీలీల అమ్మగారు ఓ గైనకాలజిస్ట్ .యాష్ భార్య రాధిక పండిట్ కు డెలివరీ చేసింది శ్రీలీల అమ్మ గారే. ఈ క్రమంలోని ఆమెకు శ్రీలీల కుటుంబంతో మంచి సంబంధం ఏర్పడింది . అలా శ్రీలీల -యాష్ బంధం తెలియకుండానే కొనసాగింది.

శ్రీ లీల – యాష్ భార్య ను రాధిక పండిట్ ను అక్క అంటూ పిలుస్తుందట. శ్రీలీల కూడా యాష్ ను బావ అంటూ సరదాగా ఆటపట్టిస్తుందట . ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఆమెకు అవకాశాలు రావడానికి పరోక్షంగా కారణమయ్యాడు అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే శ్రీలీల అభిమానులు మాత్రం ఈ విషయాన్ని కొట్టి పడేస్తున్నారు. ఆమెకు టాలెంట్ ఉంది.. అందం ఉంది . అందుకే ఆమె ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదిగింది అంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో మరోసారి శ్రీలీల పేరు మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news