Movies' ఖుషి ' సినిమాకు స‌మంత విడాకుల‌కు లింక్ ఉందా… 100...

‘ ఖుషి ‘ సినిమాకు స‌మంత విడాకుల‌కు లింక్ ఉందా… 100 % నిజం…!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సమంత కలిసిన నటించిన సినిమా ఖుషి. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సెప్టెంబర్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా నడుస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్లు బాగుండ‌డంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఖుషి సినిమా కథకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఖుషి సినిమా కథ‌ సమంత నిజజీవితం ఆధారంగా తెరకెక్కించారట. ముఖ్యంగా సమంత ప్రేమ పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత విడాకులు తీసుకోవడం వంటి అంశాలను ఈ సినిమాలో దర్శకుడు శివ నిర్వాణ చాలా రియలిస్టిక్‌గా చూపించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా యూనిట్ వర్గాల నుంచి కూడా ఇదే విషయం బయటకు వచ్చింది.

నాగచైతన్యతో సమంత ప్రేమలో పడటం ఇద్దరూ కలిసి పెళ్లికి ముందే చాలా గాఢంగా ప్రేమించుకోవడం.. ఆ తర్వాత అంగరంగ వైభవంగా ఇరువైపులా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం… పెళ్లి జరిగిన తర్వాత వారి మధ్య చిన్న చిన్న కారణాలతో మొదలైన గొడవలు.. చివరకు వారు విడాకులు తీసుకునే వరకు వెళ్లటం ఇవన్నీ ఖుషి సినిమాలో చూపించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లు కూడా పెళ్లికి ముందు సమంత – విజయ్ ప్రేమలో పడటం.. ఇరువైపులా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం పెళ్లి తర్వాత కాపురం పెట్టాక వారిద్దరి మధ్య ఎలా ? గొడవలు మొదలయ్యాయో మెయిన్ లైన్ అయితే చూపించారు.

ఇదంతా చూస్తుంటే సమంత నిజజీవితం ఆధారంగానే ఈ సినిమా లైన్ తీసుకున్నాడా ? అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఏది ఏమైనా సమంత నాగచైతన్య స్టోరీ ఆధారంగా ఖుషి సినిమా తెరకెక్కితే రేపు రిలీజ్ అయ్యాక పెద్ద సంచలనం అవుతుంది అనటంలో సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news