Moviesప్రభాస్-శ్రీలీల కాంబోలో మిస్ అయిన సినిమ ఏంటో తెలుసా..? జస్ట్ మిస్..!!

ప్రభాస్-శ్రీలీల కాంబోలో మిస్ అయిన సినిమ ఏంటో తెలుసా..? జస్ట్ మిస్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీలీల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అతి చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా తన పేరుని మారుమ్రోగి పోయేలా చేసుకుంటుంది . ఈ బ్యూటీ సక్సెస్ ని తన కేరాఫ్ అడ్రెస్ గా మార్చుకుంటూ టాలీవుడ్ స్టార్ హీరోలని సైతం తన ఇంటికి రప్పించుకునే అంత స్థాయికి ఎదిగిపోయింది .

ప్రజెంట్ అమ్మడు ఖాతాలో ఉన్న సినిమాలన్నీ బిగ్ ప్రజెక్ట్స్నే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే ఈ అమ్మడు పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమాలో ఆఫర్ వస్తే లాస్ట్ లో మిస్ అయిపోయింది అంటూ తెలుస్తుంది . ఆ సినిమా మరేదో కాదు మారుతి – ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న రాజా డీలక్స్ . ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ వస్తే చిన్న సినిమా అయినా ఓకే చేసిందట .

కానీ ప్రభాస్ సున్నితంగా ఆమెను ఈ సినిమా నుంచి తీసేయమంటూ సజెస్ట్ చేశారట . దానికి కారణం హైట్ చాలా తక్కువగా ఉంటుంది అని. ప్రభాస్ ఏమో ఆరడుగుల ఆజానుబాహుడు.. మరి ప్రభాస్ పక్కన శ్రీలీల ఎలా సెట్ అవుతుందనుకుంటాడు మారుతి . క్రేజ్ ఉంటే సరిపోతుందా? ఈడు జోడు కూడాలి చూడాలి గా అంటూ అప్పట్లో జనాలు ఫైర్ అయ్యారు. అయితే అలా తనకి ఎంతో ఇష్టమైన హీరో తో కలిసి నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది అంటూ శ్రీలీల తెగ బాధపడి పోయిందట. చూడాలి మళ్లీ ఈ కాంబో మళ్లీ ఎప్పుడు సెట్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news