Moviesరిబ్బ‌న్ క‌టింగ్‌ కోసం హ‌నీ రోజ్ ఎంత చార్జ్ చేస్తుందో తెలుసా.....

రిబ్బ‌న్ క‌టింగ్‌ కోసం హ‌నీ రోజ్ ఎంత చార్జ్ చేస్తుందో తెలుసా.. సమంత కూడా వేస్ట్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఏ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒకప్పుడు స్టార్ హీరోలో ఎక్కువగా పారితోషకం అందుకునే వాళ్ళు . అయితే ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది . హీరోలకు మేము ఏమాత్రం తీసిపోము అంటూ హై రేంజ్ లో రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్నారు కొంత మంది ముద్దుగుమ్మలు. అయితే సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి కొన్ని ఏళ్లు దాటి వరుసగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుని టాప్ రేంజ్ లో ఉన్న హీరోయిన్ అలా చార్జ్ చేసిన పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు.

అయితే సినిమా ఇండస్ట్రీలోకి నిన్న కాక మొన్న వచ్చి రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యి.. ఒకే ఒక్క సినిమాతో హిట్ అందుకున్న బ్యూటీ సైతం కోట్లు డిమాండ్ చేస్తూ ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆ లిస్ట్ లోకి వస్తుంది హనీ రోజ్ . టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ మలయాళీ బ్యూటీ మొదట్లో రెండు సినిమాలు చేసింది. అవి పెద్దగా హిట్ అవ్వలేదు ఆ తర్వాత బాలయ్య హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో ఆయనకు మరదలు పాత్రలో నటించి మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ కుర్రాళ్ళు మనోభావాలను దెబ్బతీసేసింది.

ఈ సినిమాలో హనీ పాత్ర ఎంత హైలైట్ గా మారిందో మనకు బాగా తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్న హనీ రోజ్ సినిమాల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. కానీ షాప్ ఓపెనింగ్ ఈవెంట్స్ కి మాత్రం రోజుకి రెండు మూడు అయినా చేస్తూ వస్తుంది . దానికి కారణం ఒక సినిమాలో నటిస్తే ఆమెకు వచ్చే రెమ్యూనరేషన్ కోటి రూపాయలు కన్నా తక్కువే.

అయితే ఒక ఈవెంట్ కి ..ఒక షాపింగ్ మాల్ కి వెళ్లి రిబ్బన్ కటింగ్ చేస్తే ఆమె దాదాపు 50 లక్షలు ఛార్జ్ చేస్తుందట . ఓ హీరోయిన్ కి ఇది చాలా ఎక్కువనే చెప్పాలి . సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన సమంత కెరియర్ స్టార్టింగ్ లో అలా చేసినందుకు కేవలం 25 లక్షల పుచ్చుకుంది అని చెప్పాలి . అయితే ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా హనీ రోజ్ అడిగినంత ఇస్తున్నారు సదరు నిర్మాణ సంస్థలు . ఈ క్రమంలోనే హనీ రోజ్ పేరు మరోసారి వైరల్ గా మారింది . ఒక్క వారానికి మూడు నాలుగు చేసుకున్న సరే ఆమె ఖాతాలో రెండు కోట్లు పక్కా అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news