Moviesతెలుగు బిగ్‌బాస్ 7లో శృంగార తార ష‌కీలా… షాకింగ్ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్‌..!

తెలుగు బిగ్‌బాస్ 7లో శృంగార తార ష‌కీలా… షాకింగ్ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్‌..!

తెలుగు బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. బిగ్ బాస్ 7వ సీజ‌న్ వ‌చ్చే నెల 3వ తేదీ నుంచి స్టార్ మాలో ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల లిస్ట్ ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఈ సారి ఏకంగా 20 మంది కంటెస్టెంట్లు హౌస్ లోప‌ల‌కు ఎంట్రీ ఇస్తార‌ని స‌మాచారం.

ఈ సారి గ‌తం కంటే భిన్నంగా వివాదాస్ప‌ద కంటెస్టెంట్ల‌ను హౌస్‌లోపల‌కు పంపిస్తున్న‌ట్టు స‌మాచారం.
ఇప్పటికే జబర్దస్త్ వర్ష ఈ షోకు ఫిక్స్ అయ్యారు. అలాగే యువ‌రైతు పల్లవి ప్రశాంతి కూడా ఈ షోలో ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇక 20 సంవత్సరాల క్రితం సౌత్ ఇండియా ను ఒక ఊపు ఊపేసిన శృంగార తార షకీలాను కూడా ఈసారి హౌస్ లోపలికి పంపిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆమె హౌస్ లోపలికి వెళితే షోకు కావలసినంత పాపులారిటీ వస్తుంది. ఈ షోలో పాల్గొనేందుకు షకీలాకు భారీ స్థాయిలో రెమ్యున‌రేష‌న్ ఆఫర్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం షకీలా ఎక్కువగా సినిమాలలో నటించడం లేదు. ఈ క్రమంలోని ఆమెకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. ఈ షోలో షకీలా లాస్ట్ వీక్ వరకు ఉంటే 50 లక్షలు కంటే ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉందని తెలుస్తోంది.

బిగ్ బాస్ షో ఎంట్రీ గురించి షకీలా త్వరలోనే ఇంటర్వ్యూలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఏడవ సీజన్‌కు కూడా టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత సీజన్లతో పోటీ చూస్తే ఈ సీజన్‌కు నాగార్జునకు ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చేలా బిగ్ బాస్ నిర్వాహకులతో ఒప్పందం కుదిరిందని సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news