నందమూరి అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా దేవర. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా ఇదే. ఇక ఇటు నందమూరి హీరో బాలయ్య భగవంత్ కేసరి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలోకి వస్తోంది.
ఇక నందమూరి ఫ్యామిలీలో మూడో తరం హీరో అయిన బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులే కాకుండా.. సగటు సినీ అభిమానులు కూడా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. నాలుగైదు సంవత్సరాలుగా మోక్షజ్ఞ డెబ్యూ కోసం అందరి వెయిటింగ్ మామూలుగా లేదు. మోక్షు కూడా డెబ్యూ మూవీ కోసం శిక్షణలో ఫుల్ బిజీగా ఉన్నాడు.
మోక్షు ఎంట్రీకి కాస్త టైం పట్టేలా ఉండగా తాజాగా మోక్షు తన కుటుంబంతో కలిసి ఉన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని తనయుడు వివాహ వేడుకలో ఈ అరుదైన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఈ వేడుకకు సంబంధించి చాలా ఫొటోలు బయటకు వచ్చినా ఓ బ్యూటిఫుల్ పిక్ మాత్రం టోటల్ పెళ్లి వేడుకకే బిగ్గెస్ట్ హైలైట్ అయ్యింది.
ఈ ఫొటోలు జూనియర్ ఎన్టీఆర్ – మోక్షజ్ఞ ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆ వేడుకలో ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించాడు. ఈ ఫోటోను ఇప్పుడు నందమూరి అభిమానులు ఒక రేంజ్‌లో వైరల్ చేస్తుండడంతో ఇది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.