News"దేవర" సినిమాకి సైన్ చేసి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసిన స్టార్ హీరోయిన్.....

“దేవర” సినిమాకి సైన్ చేసి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎన్టీఆర్ అంతలా బాధపడ్డారా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ నటిస్తున్న సినిమా దేవర . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన చిన్న అప్డేట్ రిలీజ్ అయితే ఫాన్స్ లో ఎక్కువ ఉత్సాహం కనిపిస్తుంది. అంతేకాదు ఆర్ ఆర్ ఆర్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ ఎంతో ఇష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అభిమానులు.

రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది . కాగా ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ సెలెక్ట్ చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే . జాన్వి కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. చాలా ట్రెడిషనల్ గా అట్రాక్టివ్ గా కనిపించింది జాన్వి కపూర్ .అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ కన్నా ముందే హీరోయిన్ అలియా భట్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా అనుకున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి .

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆలియా భట్ ను కొరటాల శివ దర్శకత్వంలో తెరలెల్లే మూవీ కోసం ఫిక్స్ చేసుకున్నారట . అంతేకాదు ఎన్టీఆర్ సైతం ఓకే చేశారట . కానీ ఆలియా భట్ ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత వెంటనే ప్రెగ్నెన్సీ రావడంతో ఈ సినిమా నుంచి తప్పుకునిందట . ఆ కారణంగానే అగ్రిమెంట్ పై సైన్ చేసిన కూడా ఈ అగ్రిమెంట్ను క్యాన్సిల్ చేసుకుని రెమ్యూనరేషన్ గా ఇచ్చిన డబ్బులను తిరిగి ఇచ్చేసి మరీ ఈ సినిమా నుంచి తప్పుకుందట. ఆ తర్వాత ఈ రోల్ కోసం చాలామందిని ట్రై చేయగా ఫైనల్లీ జాన్వీ కపూర్ సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపించాయి . మొత్తానికి జాన్వీ కపూర్ ఎంట్రీ ఎన్టీఆర్ తోనే రాసిపెట్టింది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news