Newsబాలీవుడ్ లోకి కీర్తి సురేష్.. హీరో ఎవరో తెలిస్తే కళ్లు జిగేల్.....

బాలీవుడ్ లోకి కీర్తి సురేష్.. హీరో ఎవరో తెలిస్తే కళ్లు జిగేల్.. భలే ఆఫర్ పట్టేసిందే..!!

టాలీవుడ్ మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ ఎలాంటి క్రేజీ స్థానంలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నేను శైలజ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ .. అంతకుముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలో నటించిన విషయం తెలిసిందే . కాగా మహానటి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ బ్యూటీగా రాజ్యమేలేసిన ఈ బ్యూటీ ఇప్పటికీ ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ ద్వారానే అవకాశాలు అందుకుంటుంది .

మరి కొద్ది రోజుల్లోనే భోళా శంకర్ సినిమా ద్వారా మరో హిట్టు తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్న కీర్తి సురేష్ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు శాండిల్ వుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లో సినిమాలు చేసిన ఈ కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ లో ను అడుగుపెట్టబోతుంది అంటూ తెలుస్తుంది . ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది.

బాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో వరుణ్ ధావన్ సరసన కీర్తి సురేష్ నటించ బోతున్నట్లు తెలుస్తుంది. వరుణ్ ధావన్ బవాల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . ఆ తర్వాత అట్లీ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది . ఈ క్రమంలోనే ఈ తమిళ్ డైరెక్టర్ తమిళ్ హీరోయిన్ కీర్తి సురేష్ ని ఈ ప్రాజెక్టు కోసం ఎంచుకున్నారట . ఈ ప్రాజెక్టు ద్వారానే కీర్తి సురేష్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news