Movies"ఆ విషయం ఎలా మర్చిపోయారు"..సుమతో విడాకుల పై రాజీవ్ సంచలన కామెంట్స్..!!

“ఆ విషయం ఎలా మర్చిపోయారు”..సుమతో విడాకుల పై రాజీవ్ సంచలన కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని టాప్ మోస్ట్ యాంకర్ గా రాజ్య మేలేస్తుంది యాంకర్ సుమ. కొన్ని దశాబ్దాలుగా చెరగని రికార్డులతో తన వాక్యతుర్యంతో సినిమా ఇండస్ట్రీలో ఆడియో ఫంక్షన్ కి .. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకి హోస్టుగా చేస్తున్న సుమ బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతుంది . అయితే అసలు నెగెటివిటీ అనేది లేకుండా ఫుల్ పాజిటివ్ మైండ్ తో దూసుకుపోయే సుమ కూడా తన భర్త దగ్గర నుండి విడాకులు తీసుకోవాలనుకునింది అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఇదే వార్తను కన్ఫర్మ్ చేస్తే సుమ సైతం గతంలో నాకు రాజీవ్ కు మధ్య విభేదాలు వచ్చాయని.. అప్పుడు విడాకులు తీసుకోవాలనుకున్నామని కానీ .. ఆ తర్వాత పిల్లల కోసం ఆగిపోయామని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది .

ఎప్పుడైతే సుమ ఓపెన్ గా ఈ విషయాలు చెప్పిందో అప్పటినుంచి ఆ వార్తపై మరిన్ని రూమర్స్ క్రియేట్ చేశారు కొందరు ఆకతాయిలు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆరు నెలలకు ఒకసారి సుమ విడాకులు అంటూ ట్రెండ్ చేస్తారు కొందరు ఆకతాయిలు. రీసెంట్గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై తన కుటుంబం ను ఇలా టార్చర్ చేయకండి అంటూ ఫుల్ ఫైర్ అయిపోయారు రాజీవ్.

ఆయన మాట్లాడుతూ..” ప్రతిసారి నా భార్యతో విడాకులు తీసుకుంటున్నాను అంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు . అలా చేస్తే మీకు ఏమొస్తుంది ..? ఆ వార్తలు అబద్ధం అని నేను చెప్తూనే ఉన్నాను. అవి అబద్దం అని ప్రూవ్ చేయడానికి నా భార్యతో రీల్స్ చేస్తున్నాను ..ఆమె హోస్ట్ చేసే షోలకి వెళ్తున్నాను .. ఇకనైనా నమ్మండి మీ వార్తలు వల్ల మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు . స్కూల్ కి వెళ్ళినా కూడా వారిని ఇదే వార్తలు వేధిస్తున్నాయట . దయచేసి నాకు కుటుంబ ఉంది అని అర్థం చేసుకోండి.. నిజంగా ఈ వార్తలు మా తల్లిదండ్రులు వినుంటే కుమిలి కుమిలిపోయి ఉండేవారు. మాకు ఓ కుటూంబం ఉందని మీరు ఎలా మర్చిపోయారు..?” అంటూ తమ విడాకులు పై క్లారిటీ ఇచ్చాడు రాజీవ్ కనకాల . ప్రెసెంట్ రాజీవ్ కనకాల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news