Moviesమోక్షజ్ఞ ఎంట్రీ పై క్రేజీ హింట్ ఇచ్చేసిన బాలయ్య.. డైరెక్టర్ ఆయనే...

మోక్షజ్ఞ ఎంట్రీ పై క్రేజీ హింట్ ఇచ్చేసిన బాలయ్య.. డైరెక్టర్ ఆయనే ఫిక్స్..!?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో నందమూరి వారసుడు రాక కోసం కోట్లాదిమంది అభిమానులు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సోషల్ మీడియాలో నందమూరి మోక్షజ్ఞ పేరు కనపడిన.. పిక్చర్ కనపడిన తెగ టెండ్ చేసేస్తున్నారు. అలాంటి ఓ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇండస్ట్రీలోకి రాకముందే అందుకున్నాడు మోక్షజ్ఞ. కాగా నందమూరి బాలకృష్ణ నట వారసురుడుగా త్వరలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఆయన కొడుకు గురించి బాలయ్య దగ్గర నుంచి ఓ క్రేజీ హింట్ వచ్చేసింది .

మనకు తెలిసిందే నందమూరి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ త్వరలోనే ఆదిత్య 369 సిక్వెలతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది . ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ ఆఫ్ ది రికార్డ్ బాలయ్య నే స్వయంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు అంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ సినిమా పనులు ప్రారంభమవుతాయని.. జాతకం ప్రకారం కూడా తన బిడ్డకు అలాగే ఉంది అంటూ బాలయ్య చెప్పుకొచ్చారట.

అయితే రీసెంట్ గా అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న బాలయ్య ..తన అభిమానుల వద్ద కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది . నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అడుగుతూ బోయపాటి శ్రీను లాంచ్ చేయబోతున్నారట కదా అన్న క్రమంలో ఆయన మాట్లాడుతూ ..”అంత దైవేచ్ఛ” అంటూ నవ్వి ఊరుకున్నారు . ప్రస్తుతం మోక్షజ్ఞ అమెరికాలో యాక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నాడు . ఇది పూర్తి అయిపోగానే తెరపైకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది . ఒకటి మాత్రం కన్ఫామ్ ఆదిత్య 369 సీక్వెల్లో బోయపాటి దర్శకత్వంలో బాలయ్యతో కలిసి ఎన్టీఆర్ మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని ఫ్యాన్స్ కన్ఫామ్ అయిపోయారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news