Newsధోని భార్య కి ఆ తెలుగు హీరో అంటే అంత ఇష్టమా..?...

ధోని భార్య కి ఆ తెలుగు హీరో అంటే అంత ఇష్టమా..? భర్త మ్యాచ్ ఉన్న ఆయన సినిమాలే చూస్తుందా..?

ఇండియన్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే టీమిండియా లెజెండ్ క్రికెటర్ గా పేరు సంపాదించుకున్న ఎంఎస్ ధోని రీసెంట్గా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు . కాగా ఎంఎస్ ధోని ఎంటర్టైన్మెంట్ పథకం పై సాక్షి ధోని నిర్మాతగా . తమిళంలో “ఎల్జిఎం ..లెట్స్ గెట్ మ్యారి” అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిపోతుంది. ఈ చిత్రం ద్వారా రమేష్ తమిళమణి దర్శకుడిగా పరిచయం అవుతూ ఉండగా హరీష్ కళ్యాణ్ నటి ఇవాళ జంటగా నటించారు.

ఈ చిత్రంలో ఒకప్పటి హీరోయిన్ నదియా – యోగి బాబు తదితరులు ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు . ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది . ఈ క్రమంలోని చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ధోని భార్య మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలోని సరదాగా మీడియాతో కబుర్లు చెప్పిన ధోని భార్య సాక్షి తెలుగులో తన ఫేవరెట్ హీరో ఎవరో చెప్పేసింది .

“మీరు తెలుగు హీరోల సినిమా చూస్తారా..?” అని రిపోర్టర్స్ ప్రశ్నించగా సాక్షి బదిలీస్తూ “నేను ఆర్ఆర్ఆర్ – బాహుబలి లాంటి సినిమాలు చూశానని.. కానీ అల్లు అర్జున్ సినిమాలు అయితే కచ్చితంగా చూస్తానని ఇప్పటివరకు ఆయన నటించడం ప్రతి సినిమా నేను చూశానని చెప్పుకొచ్చింది. నేను బన్నికి అంత పెద్ద ఫ్యాన్ ని కూడా సాక్షి తెలిపారు”. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో బన్నీ ఫాన్స్ ఈ కామెంట్స్ ని ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు కొన్నిసార్లు భర్త మ్యాచ్ ఉన్నా కానీ అల్లు అర్జున్ సినిమా వస్తుందంటే ముందుగా అల్లు అర్జున్ సినిమా చూడటానికి ప్రిఫరెన్స్ ఇస్తుందట సాక్షి . అంత పెద్ద ఫ్యాన్ బన్నీకి అంటూ సోషల్ మీడియాలో వార్తలు ట్రెండ్ అవుతున్నాయి . ప్రెసెంట్ ఈ వీడియోని బన్నీ ఫాన్స్ భారీ ఎత్తున వైరల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news